Mouthwash: మౌత్‌వాష్‌ను ప్రతిరోజు ఉపయోగిస్తున్నారా? అయితే ఈ విషయం తెలుస్తే షాక్ అవుతారు

Mouthwash Health Risk: మౌత్‌ వాష్‌ని మనం మన దినచర్యలో ఉపయోగిస్తాము. దీంతో దంత క్షయాన్ని తొలగించడానికి వాడుతాము. అయితే ఈ మౌత్‌వాష్‌పైన కొందరు నిపుణులు పరిశోధనలు చేశారు. వారి పరిశోధన ప్రకారం ఈ  మౌత్ వాష్‌ని ఉపయోగించడం వల్ల హాని జరుగుతుందని అంటున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2024, 11:44 AM IST
Mouthwash: మౌత్‌వాష్‌ను ప్రతిరోజు ఉపయోగిస్తున్నారా? అయితే ఈ విషయం తెలుస్తే షాక్ అవుతారు

Mouthwash Health Risk: మనం ప్రతిరోజు ఉదయం నోటి సంరక్షణ కోసం బ్రషింగ్‌తో పాటు మౌత్‌వాష్‌ను ఉపయోగిస్తాము. మౌత్‌ వాష్‌ చేయడం వల్ల నోటి దుర్వాసనను తొలిగిస్తుంది. దీన్నీ ప్రతిరోజు ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి హానికరమని కొన్ని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా మౌత్‌ వాష్‌లో ఉండే కెమికల్స్‌తో  నోటి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు.  ముఖ్యంగా నోరు పొడిబారడం వంటి సమస్యలు ఎక్కువగా  తలెత్తున్నాయని హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం మౌత్‌వాష్‌లో ఆల్కహాల్‌ ఉండటం. మౌత్‌ వాష్‌ కారణంగా దురద, చికాకు వంటి సమస్యలు కూడా కలుగుతాయి. 

మౌత్‌ వాష్‌ వల్ల కొందరిలో దంతక్షయ సమస్యలు కూడా ఎక్కువగా తలెత్తుతాయి. ఆరోగ్యనిపుణుల ప్రకారం మౌత్‌ వాష్‌ను దంత సమస్యలతో, నోటి సమస్యలు ఉన్నారు ఉపయోగించకుండా ఉండాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా మౌత్‌వాష్‌ ఉపయోగిచడం వల్ల క్యాన్సర్‌ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. 

మౌత్‌ వాష్‌ ఉపయోగించడం వల్ల దంతాలు పసుపుర రంగులోకి మారిపోతాయని చెబుతున్నారు. దంతక్షయం, చిగుళ్ల నొప్పి దంతాలు రంగు మారవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా మౌత్‌ వాష్‌లో ఉండే కెమికల్స్‌ దంతాలను పసుపు రంగులోకి మారిపోతాయని అంటున్నారు. కాబట్టి మౌత్‌ వాష్‌ వాడకం విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

కొందరు రెగ్యులర్‌గా మౌత్‌ వాష్‌లను ఉపయోగించడం వల్ల దంత సమస్యలు వస్తాయి. దీని వల్ల దంతాలపై మచ్చలు ఏర్పడతాయి. అలాగే దంతాలు గరుకుగా, బలహీనంగా తయారు అవుతాయని చెబుతున్నారు. కాబట్టి  మార్కెట్‌లో లభించే కెమికల్స్‌ మిక్స్‌ మౌత్‌ వాష్‌ కంటే సహాజంగా మనం మౌత్‌ వాష్‌ను తయారు చేసుకుని వాడొచ్చు. దీని వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడాల్సిన అవసరం లేదు. 

Also Read: Black Grapes: షుగర్‌ లెవెల్స్‌ కంట్రోల్‌ చేయడంలో ఈ పండు ఎంతో ఉపయోగపడుతంది

అలాగే దంత సంరక్షణ కోసం రెగ్యులర్‌ బ్రషింగ్, ఇంటర్‌డెంటల్‌ క్లీనింగ్‌, డెంటల్‌ చెకప్స్‌ చేయించుకుంటే దంతాల సమస్యలు తగ్గుతాయి. కొంతమందిలో చిగుళ్ల వ్యాధి, దంత సమస్యలు వచ్చినప్పుడు శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. నోటి పరిశుభ్రత పాటించడం,దంత సమస్యలు ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించడం చాలా మంచిది. ప్రతిరోజు తిన్న తర్వాత నీరుతో నోరు పుక్కిలించడం వల్ల దంత సమస్యలు తగ్గుతాయి.

Also Read: Side Effects Of Turmeric: వీళ్లు పసుపు తీసుకుంటే యమ డేంజర్‌.. ఈ సమస్యలు ఉంటే దూరంగా ఉండండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News