చాలామందికి కిడ్నీలో రాళ్ల గురించే తెలుసు. కానీ ఇంకొన్ని భాగాల్లో కూడా రాళ్లు ఏర్పడుతుంటాయని తెలియదు. అసలు కిడ్నీలో కాకుండా..ఇంకా ఏ శరీర భాగాల్లో రాళ్లుంటాయో తెలుసుకుందాం.
శరీరంలో కిడ్నీలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. అందుకే కిడ్నీలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవల్సి ఉంటుంది. కిడ్నీ సమస్య అంటే సహజంగా గుర్తొచ్చేది కిడ్నీలో రాళ్లు. కిడ్నీలో రాళ్లు ఏర్పడటం ప్రమాదకరమే కానీ ఇవే రాళ్లు శరీరంలో ఇతర అవయవాల్లో కూడా ఏర్పడుతుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు గుర్తించకపోయినా లేదా నిర్లక్ష్యం చేసినా ప్రాణాంతకం కావచ్చు.
శరీరంలోని ఏ భాగాల్లో రాళ్లుంటాయి
కిడ్నీలో రాళ్లు అనేది అందరికీ తెలిసిందే. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, అధిక బరువు, మందులు ఎక్కువగా వాడటం, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడమనేది కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణాలు. కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే భరించలేని నొప్పి ఉంటుంది.
ఇక పిత్తాశయం సంచిలో కూడా రాళ్లుంటాయి. పిత్తాశయం సంచి అనేది లివర్‌కు దిగువన కుడివైపుంటుంది. పిత్తాశయం నాళికలో ఏదైనా అవరోధం కలిగినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. పిత్తాశయం సంచిలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే అది రాయి రూపంలో మారుతుంది. ఫలితంగా తీవ్రమైన, భరించలేని నొప్పి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు సర్జరీ ఒక్కటే ప్రత్యామ్నాయం. పిత్తాశయంలో రాళ్లుంటే.. పిత్తాశయం చుట్టుపక్కల నొప్పి, ఛాతీలో మంట, కడుపు బరువుగా ఉండటం, అజీర్ణం, పుల్లటి తేన్పులు ప్రధాన లక్షణాలుగా కన్పిస్తాయి.
కిడ్నీతో పాటు మూత్రాశయంలో కూడా రాళ్లుంటాయి. శరీరంలోని మినరల్స్ కఠినంగా మారినప్పుడు ఈ పరిస్థితి ఉత్పన్నమౌతుంది. ఈ పరిస్థితుల్లో నొప్పి అధికంగా ఉంటుంది. వ్యక్తి మూత్రాశయం పూర్తిగా ఖాళీ అవదు. దాంతో మూత్రం వెంటవెంటనే రావడం, మూత్రం పోసేటప్పుడు ఇబ్బంది కలగడం, మూత్రంలో రక్తం కారడం, నొప్పి వంటివి ప్రధాన లక్షణాలు.
ఈ లక్షణాలు కన్పించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా తక్షణం వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే కిడ్నీలో రాళ్లు ఎంత ప్రమాదకరమో ఇవి కూడా అంతే ప్రమాదకరం. తీవ్రత తక్కువగా ఉన్నప్పుడే గుర్తిస్తే వైద్యం సులభమౌతుంది.
Also read: Dengue Cases: పెరుగుతున్న డెంగ్యూ కేసులు, డెంగ్యూ లక్షణాలేంటి, ప్లేట్‌లెట్స్ ఎలా ఎక్కిస్తారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook