Blood Pressure: వ్యాయామం తరువాత బీపీ పెరిగిపోతోందా, ఏం చేయాలి, వైద్యులేమంటున్నారు

Blood Pressure: ఆధునిక జీవన విధానంలో ఆరోగ్యం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది డైటింగ్ చేస్తుంటే మరి కొంతమంది వాకింగ్‌ను ఆశ్రయిస్తుంటారు. ఇంకొంతమంది వ్యాయామం లేదా యోగాలు అనుసరిస్తుంటారు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 20, 2023, 01:11 AM IST
Blood Pressure: వ్యాయామం తరువాత బీపీ పెరిగిపోతోందా, ఏం చేయాలి, వైద్యులేమంటున్నారు

Blood Pressure: వ్యాయామం, వాకింగ్ వంటి ప్రక్రియల ద్వారా శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును కరిగించే ప్రయత్నం చేస్తుంటారు. బాడీని ఫిట్ అండ్ ఎనర్జటిక్‌గా ఉంచాలంటే ఇది తప్పనిసరి. అంటే రోజూ వ్యాయామం చేయాల్సిందే. రోజూ వ్యాయామం చేస్తుంటే ఇతర అనారోగ్య సమస్యలు కొన్ని వెంటాడుతుంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా శరీరాన్ని ఫిట్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉంచేందుకు జిమ్, ఎక్సర్‌సైజ్, ఆటలు, వాకింగ్, రన్నింగ్  వంటివి చేస్తుంటారు. వీటివల్ల రక్త నాళికలు యాక్టివ్‌గా పనిచేయడం ప్రారంభిస్తాయి. రక్త నాళికలు స్ట్రెచ్ అవుతుంటాయి. మొత్తానికి రోజూ చెమట్లు కారేలా వ్యాయామం చేసినప్పుడు రక్తపోటు పెరుగుతుంటుంది. చాలామందికి ఈ సమస్య వెంటాడుతుంటుంది. ఇలా ఎందుకౌతుంది. వ్యాయామం శరీరానికి మంచిదే కదా..మరి రక్తపోటు సమస్య ఎందుకు తలెత్తుతోంది. ఈ సమస్యకు ప్రముఖ వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

జిమ్‌కు వెళ్లి వర్కవుట్స్ చేసిన తరువాత బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందనడం పూర్తిగా నిజం కాదంటున్నారు వైద్యులు. వాస్తవానికి జిమ్, వ్యాయామం లేదా ఆటల్లో పాల్గొన్నప్పుడు ఆ వ్యక్తి రక్త నాళికలు స్ట్రెచ్ అవుతుంటాయి. దాంతో రక్త సరఫరా కొద్దిగా వేగవంతం కావడం సహజమే. కానీ కాస్సేపటికి ఇది సాధారణ స్థాయికి వచ్చేస్తుంది. అంటే బీపీ సమస్య కాదని స్పష్టంగా తెలుస్తుంది.

వాస్తవానికి రక్తపోటు సమస్య ముందే ఉన్నవాళ్లు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముందు నుంచే బీపీతో బాధపడేవాళ్లు ఒకేసారి ఎక్కువగా ఉరుకులు పరుగులు పెట్టడం అంటే ఒకేసారి ఎక్కువ రన్నింగ్ చేయడం లేదా వ్యాయామం చేయడం మంచిది కాదు. ఇది పూర్తిగా రిస్క్‌తో కూడుకున్నదే. అదే విధంగా గుండెపోటు సమస్యతో బాధపడేవాళ్లు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యకరమైన వ్యక్తికి ఇది సమస్య కాదు. అంటే వ్యాయామం చేసిన ప్రతిసారీ బీపీ ఎక్కువగా ఉన్నట్టుగా ఉంటే..ముందే మీకు బీపీ సమస్య ఉన్నట్టు అర్ధం. తక్షణం వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. 

వ్యాయామం చేసిన 2 గంటల వరకూ బీపీ ఎక్కువే ఉంటుంది 2 గంటలు విశ్రాంతి తీసుకుంటే నెమ్మదిగా సాధారణ స్థాయికి వస్తుంది. బీపీ సమస్య. ఉన్న వ్యక్తి వ్యాయామం చేయాలంటే ముందుగా వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. అధిక రక్తపోటు సమస్య ఉండే వ్యక్తి రన్నింగ్, సైక్లింగ్ వంటివి చేయాలి. హై డెన్సిటీ ఉండే వ్యాయామ ప్రక్రియ చేయకూడదు. టెన్నిస్, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్ వంటి ఆటలు ఆడకూడదు.

Also read: Delhi Red Fort: ఢిల్లీ ఎర్రకోట అసలు రంగు ఇది కాదా, రంగు ఎవరు, ఎందుకు మార్చారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News