Skin Care Tips: వారంలో ఒకసారి ఈ ఫేస్‌ప్యాక్ రాస్తే చాలు, ముఖం నిగనిగలాడటం ఖాయం

Skin Care Tips: అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందంగా కన్పించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. మనం చేసే అన్ని ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనివ్వదు. కొన్ని వికటిస్తుంటాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 17, 2023, 03:45 PM IST
Skin Care Tips: వారంలో ఒకసారి ఈ ఫేస్‌ప్యాక్ రాస్తే చాలు, ముఖం నిగనిగలాడటం ఖాయం

Skin Care Tips: రోజూ ఉదయం లేవగానే దాదాపు అందరూ టీ లేదా కాఫీ తాగుతుంటారు. శరీరాన్ని యాక్టివ్‌గా, ఫ్రెష్‌గా ఉంచేందుకు కాఫీ తాగడం ఓ అలవాటు. కానీ అదే కాఫీతో అందంగా ఉండవచ్చని, ముఖం నిగనిగ మెరిసేలా చేయవచ్చని చాలామందికి తెలియదు. మీరు తాగే కాఫీని ముఖానికి రాసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..

ఆధునిక జీవన విధానంలో జంక్ ఫుడ్స్ వల్ల కావచ్చు, వాతావరణంలో కాలుష్యం వల్ల కావచ్చు ముఖంపై మనకు తెలియకుండా వివిధ రకాల మచ్చలు, పింపుల్స్ ఏర్పడి ముఖాన్ని అంద వికారంగా మారుస్తుంటాయి. ఈ మచ్చలు పోగొట్టేందుకు ఒక్కోసారి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా విఫలమౌతుంటారు. ఈ సమస్యకు సమాధానం మన కిచెన్‌లోనే ఉంది. రోజూ మనం తాగే కాఫీతో ముఖానికి మసాజ్ చేయడం ద్వారా ముఖంపై మచ్చల్లేకుండా చేసుకోవచ్చు. చర్మం నిగనిగలాడేలా మార్చుకోవచ్చు.

మీ ముఖంపై పింపుల్స్ ఉంటే కాఫీ ఫేస్‌ప్యాక్ ద్వారా తొలగించవచ్చు. ముఖంపై ఉండే చర్మ కణాలు శుభ్రమై పింపుల్స్ తగ్గుతాయి. ఎందుకంటే కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి. పింపుల్స్‌కు కారణమయ్యే బ్యాక్టీరియాను అంతం చేయడంలో దోహదం చేస్తాయి. కాఫీ ఫేస్‌ప్యాక్ రాయడం ద్వారా ముఖంపై ఏర్పడే డార్క్ సర్కిల్స్  నుంచి కూడా విముక్తి పొందవచ్చు. కంటి కింద చర్మంలో రక్త సరఫరా మెరుగుపడి చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తుంది. కాఫీలో ఉండే కెఫీన్ రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. కళ్లలో కన్పించే అలసట, కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయి.

కాఫీ ఫేస్‌ప్యాక్ రాయడం ద్వారా ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ సమస్య తొలగిపోతుంది. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఆయిలీ స్కిన్ సమస్య తొలగించేందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి.ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయి. చర్మం హెల్తీగా మారి డ్రై స్కిన్ సమస్య పోతుంది. చాలామందిలో ముఖంపై నల్లడి మచ్చలు కన్పిస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో కాఫీ ఫేస్‌ప్యాక్ రాయడం వల్ల ముఖంపై మచ్చలు మాయమౌతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి ట్యానింగ్ చేస్తాయి. మచ్చలు, మరకలు పోగొడుతుంది. 

కాఫీ ఫేస్‌ప్యాక్ తయారీ కూడా చాలా సులభం. 3-4 చెంచాల కాఫీ పౌడర్ తీసుకోవాలి. ఇందులో ఒక చెంచా రోజ్ వాటర్, 1 చెంచా కొబ్బరి నూనె, 1 చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తరువాత చేతులతో తొలగించి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. చివర్లో లైట్ మాయిశ్చరైజర్ ముఖానికి రాసుకోవాలి. వారంలో ఒకసారి ఇలా చేస్తే మంచి ఫలితాలుంటాయి.

కాఫీ ఫేస్‌ప్యాక్ రాసే ముందు ముఖాన్ని శుభ్రంగా కడగాలి. కాఫీ ఫేస్‌ప్యాక్‌ను ముఖంపై కనీసం 15-20 నిమిషాలుంచాలి. ఫేస్‌ప్యాక్ తొలగించాక తప్పనిసరిగా లైట్ మాయిశ్చరైజర్ రాయాలి. కాఫీతో ఎలర్జీ ఉంటే మాత్రం రాయకూడదు. 

Also read: Nerves problem: న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్యలు రావడానికి కారాణాలు, ఉన్నవారు తీసుకోవాల్సి ఆహారాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News