Peanut Butter: బిజీ ప్రపంచంతో పాటు ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. బ్రేక్‌ఫాస్ట్ రోజురోజుకూ సరళంగా మారుతోంది. 2-3 టోస్ట్ లేదా బ్రెడ్ బటర్ ఇలా సాగిపోతోంది. పీనట్ బటర్ ఎప్పుడైనా తిన్నారా..పీనట్ బటర్‌లో అద్భుత ప్రయోజనాలున్నాయని తెలుసా..
ఏది ఏమైనా నెవర్ స్కిప్ బ్రేక్‌ఫాస్ట్ అంటారు పెద్దలు. బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడూ లైట్‌గా తీసుకోకూడదు. ఎక్కువే తినాలి. కానీ అందుకు విరుద్ధంగా రోజురోజుకూ అల్పాహారమనేది చాలా సింపుల్ అవుతోంది. రెండు మూడు బ్రెడ్ స్లైడ్స్ లేదా టోస్ట్ తిని సరిపెడుతున్నారు. ఫలితంగా మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది గమనించడం లేదు. ఈ క్రమంలో పీనట్ బటర్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇదొక సూపర్ ఫుడ్. ఇందులో పుష్కలంగా ఫైబర్, ప్రోటీన్లు లభిస్తాయి. దాంతోపాటు నట్స్‌లో హై మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఐరన్, జింక్, విటమిన్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. పీనట్ బటర్ ఎలా తినాలి, ప్రయోజనాలేంటో చూద్దాం.
పీనట్ బటర్ ప్రయోజనాలు
చాలా మందికి భోజనం చేసిన కాస్సేపటికే ఆకలేస్తుంటుంది. ఫలితంగా ఏదో ఒకటి తింటుంటారు. బయటి తిండికి అలవాటు పడుతుంటాం. కానీ పీనట్ బటర్ తింటే మాత్రం తరచూ ఆకలనేది వేయదు. అతిగా తినడమనేది నియంత్రించుకోవచ్చు. అదే సమయంలో శరీరానికి కావల్సిన పౌష్ఠికాహారం సంపూర్ణంగా లభిస్తుంది.
పీనట్ బటర్‌లో చాలా న్యూట్రియంట్లు ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు లభిస్తాయి. అందుకే పీనట్ బటర్ తినండ వల్ల చాలా సేపటి వరకూ ఆకలనేది వేయదు. ఇందులో ఉండే ఫైబర్, ఫోలేట్ గుణాలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఎక్సర్‌సైజ్ లేదా వర్కవుట్స్ తరువాత పీనట్ బటర్ తింటే మంచి ఫలితాలుంటాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు అద్భుతంగా పనిచేస్తుంది.
పీనట్ బటర్ అనేది ఆరోగ్యానికే కాదు కంటికి కూడా చాలా మంచిది. చాలా సందర్భాల్లో అలసట కారణంగా కళ్లు బరువుగా అన్పిస్తాయి. ఈ సమస్యకు పీనట్ బటర్ మంచి పరిష్కారం. ఎందుకంటే ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటికి చాలా మంచిది. ఇక డయాబెటిస్ రోగులకు కూడా పీనట్ బటర్ మంచిది. ఎందుకంటే ఇదొక ప్రోసెస్డ్ ఫుడ్. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇతర వ్యాధులు కూడా దరిచేరవు. గుండె సంబంధిత వ్యాధులు దూరమౌతాయి.
Also read: Weight Loss Mistakes: బరువు తగ్గే క్రమంలో ఇలా చేస్తున్నారా.. అయితే మొదటికే మోసం..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook