How To Reduce Uric Acid: శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణాలు అధికంగా పెరగడం కారణంగా అనేక రకాల దీర్ఘకాలి వ్యాధులు వస్తాయి. కొందరిలో ఆధునిక జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లు, తక్కువ నీరు తీసుకోవడం, కేలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. శరీరంలోని రక్తంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగితే తీవ్ర కీళ్ల నొప్పులతో పాటు, కిడ్ని, గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొందరిలో యూరిక్ యాసిడ్ కీళ్ల చుట్టూ స్ఫటికాలా పేరుపోతోంది. దీని కారణంగా తీవ్ర కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడానికి ప్రధాన కారణాలు:
✾ రాత్రిపూట అతిగా తినడం
✾ ఆధునిక జీవనశైలి
✾ తక్కవ నీరు తాగడం
✾ నిద్ర లేకపోవడం
✾ ఎక్కువ నాన్ వెజ్ తినడం
✾ ఒత్తిడి
Also Read: Jailer Movie HD Quality: జైలర్ మూవీ టీమ్‌కు షాక్.. నెట్‌లో HD ప్రింట్ లీక్..!
యూరిక్ యాసిడ్ వల్ల శరీరానికి కలిగే నష్టాలు:
గౌట్:
గౌట్ అనేది ఆర్థరైటిస్ కారణంగా ఏర్పడుతుంది. దీని కారణంగానే చాలా మందిలో కీళ్లలో నొప్పి మొదలవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కీళ్లలోని కణజాలాలలో యూరిక్ యాసిడ్ అతిగా పేరుకుపోతోంది. దీంతో చాలా మందిలో సులభంగా వాపు ఇతర సమస్యల వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు నిపుణులు చెబుతున్నారు.
కిడ్నీ సమస్యలు:
మూత్రపిండాలు శరీరంలో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేస్తాయి. అయితే శరీరంలో అధిక మోతాదులో యూరిక్ యాసిడ్ పెరగడం కారణంగా మూత్రపిండాలు దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ ఆహారాలు తీసుకోవడం మానుకోండి:
గోల్డెన్ రైసిన్‌లు:
గోల్డెన్ రైసిన్‌లను ద్రాక్ష నుంచి జామ్ నుంచి తయారు చేస్తారు. దీనిని క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవడం వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి గోల్డెన్ రైసిన్‌లను అతిగా వినియోగించకపోవడం చాలా మంచిది.
చింతపండు రసం:
చింతపండు రసంతో శరానికి కావాల్సిన పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కానీ యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడేవారు ఈ రసాన్ని ప్రతి రోజు వినియోగిస్తే కీళ్లలో వాపు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Jailer Movie HD Quality: జైలర్ మూవీ టీమ్‌కు షాక్.. నెట్‌లో HD ప్రింట్ లీక్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook