Eye Flu Treatment At Home: భారతదేశ వ్యాప్తంగా ఐ ఫ్లూ గుబులు పుట్టిస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలోనూ ఈ సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఐ ఫ్లూ చిన్న పిల్లలో తొందరగా వ్యాప్తి చెందుతుంది. దీంతో చాలా మంది తల్లిదండ్రుల ఆందోళన పడుతున్నారు. అంతేకాకుండా కొంతమంది పిల్లలను స్కూల్స్‌కి పంపించడం మానుకుంటున్నారు. కండ్లకలక అనేది ఒక అంటు వ్యాధి.. కంటిలోని తెల్లని భాగాన్ని, కనురెప్పల లోపలి భాగాన్ని కప్పి ఉంచే సన్నని కణజాలాన్ని ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా కంటి చూపులో అంతరాయం కలిగి, తీవ్ర కంటి సమస్యలు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడే పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
కండ్లకలక నుంచి పిల్లలను రక్షించడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి:
క్లిన్ మాస్ట్:
కండ్లకలక సంక్రమణ వ్యాప్తిని నివారించడానికి..పిల్లలకి పరిశుభ్రత గురించి తల్లిదండ్రులు తెలియజేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరుచుగా ఆహారాలు తీసుకునే క్రమంలో చేతులు కడుక్కోమని చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా మాటి మాటికి కళ్లను తాకకూడదని చెప్పాలి.
Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు
కళ్లను రుద్దడం మానుకోండి:
పిల్లలు తరచుగా కళ్లను తాకడం, రుద్దడం చేస్తూ ఉంటారు. అయితే కండ్లకలక సమయంలో ఇలాంటి పనులు చేసే పిల్లలు తప్పకుండా అవగహాన కల్పించాల్సి ఉంటుంది. లేకపోతే ఇన్ఫెక్షన్ ప్రమాదం వచ్చే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. కళ్లలో దురద అనిపిస్తే చేతులకు బదులుగా కటన్ గుడ్డతో తాకితే ఐ ఫ్లూ రాకుండా కంటిని కాపాడుకోవచ్చు.
వినియోగించే వస్తువులను క్లీన్‌గా ఉంచాల్సి ఉంటుంది:
కండ్లకలక నుంచి పిల్లలను రక్షించడానికి..తరచుగా పిల్లలు వినియోగించే వస్తువులను శుభ్రం చేయాల్సి ఉంటుంది. అయితే పిల్లలు వినియోగించే వస్తువులను గోరువెచ్చని నీటితో శుభ్రం చేయడం వల్ల ఐ ఫ్లూ రాకుండా కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్కూల్‌కి వెళ్లే పిల్లలు ఆహారాలను పంచుకుంటూ ఉంటారు. అయితే తల్లిదండ్రులు దీనిపై కూడా అవగాహన కల్పించాల్సి ఉంటుంది.
రెగ్యులర్ ఐ టెస్ట్:
ఇప్పటికే కంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా రెగ్యులర్‌గా ఐ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే కంటి వైద్యులను సంప్రదించడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాలు ఇవ్వాల్సి ఉంటుంది.
Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి