నేరుగా మనిషి మెదడుపై ప్రభావం చూపించే మహమ్మారి ఇది. నెగ్లెరియా ఫోవ్లేరి. అమీబా జాతికి చెందిన ఈ సూక్ష్మజీవి మెదడును అమాంతం తినేస్తుంది. పలుదేశాల్లో కేసులు నమోదవడమే కాకుండా దక్షిణ కొరియాలో తొలి మరణం సంభవించింది.
నెగ్లెరియా ఫోవ్లేరి ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ వ్యాధి తొలిసారిగా 1937లో అమెరికాలో వెలుగు చూసింది. ఈ అమీబా సాధారణంగా మంచి నీటి సరస్సులు, నదులు, కాలువల్లో నివసిస్తుంటుంది. ఈ నీరు తాగినప్పుడు మెదడును చేరుకుని ఎటాక్ చేస్తుంది. దక్షిణ కొరియాలో ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఇటీవల మరణించాడు. కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ వ్యక్తి 4 రోజులు థాయ్‌లాండ్‌లో ఉండి వచ్చిన తరువాత రోజే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు.
నెగ్లెరియా ఫోవ్లేరి వ్యాధి లక్షణాలు
ఈ వ్యాధి బారిన పడినప్పుడు ముందు తలనొప్పి, వికారం, వాంతులు వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఆ తరువాత జ్వరం, వాంతులు, మెడ గట్టిగా మారడం వంటి సమస్యలు ఎదురౌతాయి. ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా 2018 నాటికి 381 కేసులు నమోదయ్యాయి. ఇండియాలో సైతం ఈ తరహా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో 1962 నుంచి 2021 వరకూ 154 కేసులు నమోదు కాగా, మరణాల రేటు 97 శాతం ఉండటం ఆందోళన కల్గిస్తోంది.
Also read: Immunity Kadha: అద్భుతమైన ఇమ్యూనిటీ కోసం..గిలోయ్ కాడా 5 నిమిషాల్లో సిద్ధం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook