Immunity power: రోగ నిరోధక శక్తి ఎందుకు తగ్గుతోంది..ఆందోళన కల్గిస్తున్న బ్రిటీష్ పరిశోధన

కరోనా వైరస్ నుంచి ప్రాణాల్ని రక్షించుకోడానికి మార్గం ఒకటే. అది బలమైన రోగ నిరోధక శక్తి. దురదృష్టవశాత్తూ ప్రజల్లో ఇది తగ్గుతోందని బ్రిటీషు శాస్త్రవేత్తల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇదే ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది. 

Last Updated : Oct 30, 2020, 12:18 AM IST
Immunity power: రోగ నిరోధక శక్తి ఎందుకు తగ్గుతోంది..ఆందోళన కల్గిస్తున్న బ్రిటీష్ పరిశోధన

కరోనా వైరస్ ( Corona virus ) నుంచి ప్రాణాల్ని రక్షించుకోడానికి మార్గం ఒకటే. అది బలమైన రోగ నిరోధక శక్తి ( Immunity power ). దురదృష్టవశాత్తూ ప్రజల్లో ఇది తగ్గుతోందని బ్రిటీషు శాస్త్రవేత్తల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇదే ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది. 

మనిషి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ( Immunity system ) పై దాడి చేస్తుంది కాబట్టే కరోనా వైరస్ అంత ప్రమాదకరంగా మారింది. మారుతున్న అలవాట్లు, జీవనశైలి కారణంగా మనుష్యుల్లో సహజసిద్ధంగా ఉండే రోగ నిరోధక శక్తి బలహీనమవుతుంటుంది. అందుకే బయట్నించి వైరస్ దాడి జరిగినప్పుడు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ విఫలమై...అదే వైరస్ కు లొంగిపోతుంది. ఫలితంగా ప్రాణాంతకంగా మారుతుంది.

కరోనా వైరస్ సంక్రమణ నేపధ్యంలో ఇప్పుడీ రోగ నిరోధక శక్తి మరోసారి ప్రాచుర్యమైంది. శరీరంలో యాంటీ బాడీస్ ( Antibodies ) ను పెంచుకోగలిగితేనే కరోనా వైరస్ నుంచి రక్షణ పొందవచ్చని ముందు నుంచీ పరిశోధకుల చెబుతూనే ఉన్నారు. దీనికి కారణం కరోనా చికిత్సకు సరైన మందు ఇంతవరకు లేకపోవడమే. రోగ నిరోధక శక్తిని పెంచే వ్యాక్సిన్లు కూడా ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో సహజ సిద్ధంగా అంటే ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు శారీరక వ్యాయామం చేయడం మరో మార్గమని కూడా వైద్యులు సూచిస్తున్నారు. 

అయితే అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ రోగ నిరోధక శక్తి బ్రిటీష్ ప్రజల్లో తగ్గుతోందని ఆ దేశపు శాస్త్రవేత్తలు ( British scientists study ) నిర్వహించిన తాజా పరీక్షల్లో నిర్ధారణైంది.ఇది చాలా ఆందోళన కల్గిస్తోంది. ఎందుకంటే కరోనా వైరస్ కేసులు ( Coronavirus cases ) బ్రిటన్ లో రోజురోజుకూ పెరుగుతున్నాయి. కానీ రోగ నిరోధక శక్తి మాత్రం తగ్గుతోంది. కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారిలో కూడా ఈ రోగ నిరోధక శక్తి తగ్గిపోతోంది. యాంటీబాడీస్ వృద్ధి చెందడం లేదు. ఇదే బ్రిటీషు శాస్త్రవేత్తలకు అంతుబట్టకుండా ఉంది. కరోనా వైరస్ ను ఎదుర్కొనే యాంటీబాడీస్ పరీక్షల్ని జూన్ నెలలో నిర్వహించినప్పుడు..కేవలం 6 శాతం మందిలో అవి ఉన్నట్టు తేలింది. సెప్టెంబర్ నాటికి ఈ సంఖ్య 4.4 శాతానికి పడిపోయింది. దేశవ్యాప్తంగా 3 లక్షల 65 వేల శాంపిల్స్ పరీక్షించడం ద్వారా ఈ విషయాన్ని కనుగొన్నారు.

కొన్ని ప్రత్యేక సందర్భల్లో మనిషిలోని యాంటీబాడీస్ తగ్గిపోవడమనేది సాధారణమే అయినా...మెమోరీ సెల్స్ గా పిల్చునే బీ సెల్స్ పడిపోకూడదంటున్నారు. అయితే మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..వీటిని సరైన పద్ధతుల ద్వారా పెంచుకోవచ్చంటున్నారు బ్రిటీష్ పరిశోధకులు. బ్రిటన్ సహా యూరప్ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ ( Corona second wave ) ప్రారంభమైన నేపధ్యంలో ఈ పరిశోధన ప్రాధాన్యత సంతరించుకుంది. Also read: Coronavirus study: అలా ఓ 30 సెకన్ల పాటు చేస్తే చాలు..కరోనా వైరస్ సంక్రమించదు

Trending News