Side Effects of AC: వేసవి కాలం మొదలైపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు గత సంవత్సరం కంటే ఇంకా ఎక్కువగానే తన వేడిని చూపిస్తూ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టనివ్వకుండా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ వేడి తట్టుకోలేక చాలామంది ఇప్పటికే కూలర్లు, ఎయిర్ కండిషనర్లు కొనేశారు.
కానీ పగలంతా చాలామంది ఆఫీస్ లో ఏసీ లోనే గడిపేస్తారు. ఇటు ఇంటికి వచ్చాక కూడా ఏసీ ఆన్ లోనే ఉంచుతారు. 24 గంటలు ఏసీలోనే ఉండటం వల్ల మన శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో చెడు జరుగుతుంది. రోజంతా ఏసీ లోనే ఉండటం వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవేంటో మనం తెలుసుకుందాం.
రాత్రంతా ఏసి ఆన్ చేసి నిద్రపోతే శ్వాసకోశ సమస్యలు వస్తాయి అని నిపుణులు చెబుతున్నారు. ముక్కు గొంతుకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి. గొంతు పొడిబారటం, ముక్కు శ్లేష్మ పొరలలో వాపు, వైరల్ ఇన్ఫెక్షన్లు, అలర్జీలు ఏసీలో ఉండటం వల్లనే వస్తాయట.
రాత్రంతా ఏసీలో గడిపే వ్యక్తుల్లో శ్వాస కోసం ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం 50% ఎక్కువగా ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ఏసీ నుంచి వచ్చే చల్లటి గాలి మన శరీరంలో ఉండే తేమని తగ్గించేస్తుంది. దానివల్ల కళ్ళు కూడా పొడి బారిపోతూ ఉంటాయి. ఫలితంగా కళ్ళు మంటలు వస్తాయి. కొన్నిసార్లు దృష్టి మసకబారడం కూడా జరుగుతుంది.
రాత్రంతా ఏసీలో ఉంటే మన చర్మం మొత్తం పొడిబారిపోతుంది. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారి పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా మారుతుంది. డిహైడ్రేషన్ వల్ల తలనొప్పి ఇబ్బంది పెడుతుంది. మైగ్రేన్ ఉన్న వారిలో కూడా ఏసి తలనొప్పిని ట్రిగర్ చేస్తుంది.
చాలాసేపు ఏసీ గదిలో ఉండి హఠాత్తుగా బయటకు వెళ్లినా కూడా సడన్ గా వచ్చే టెంపరేచర్ చేంజ్ వల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. అనారోగ్యకరమైన వాతావరణం లో పనిచేసే ఉద్యోగులలో తలనొప్పి ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ముఖ్యంగా ఏసీలోనే పనిచేసే ఉద్యోగులకు నెలకు ఒకటి నుంచి మూడు రోజులు తలనొప్పి వచ్చే అవకాశం ఉందని అధ్యయనం తేల్చి చెప్పింది.
Also Read: KCR Sensation: కాంగ్రెస్‌కు భారీ షాక్.. 20 మంది 'హస్తం ఎమ్మెల్యేలు' కేసీఆర్‌తో టచ్‌లోకి
Also Read: Cash For Vote: రేవంత్ రెడ్డిపై ఏపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు.. చంద్రబాబుతో కుమ్మక్కు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter