చలికాలం నుంచి వేసవిలో అడుగెట్టేసరికి అంతర్గత ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడినా..బాహ్య ఆరోగ్యం మాత్రం ఇబ్బంది కల్గిస్తుంటుంది. కారణం చర్మ సంబంధిత సమస్యలు. చర్మం డ్రైగా మారడం, ట్యానింగ్ సమస్య, నల్లగా మారడం వంటివి ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు. కొన్ని చిట్కాలతో ఈ సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు.
వేసవిలో ముఖ్యంగా రెండు పనులు తప్పకుండా చేయాలి. ఒకటి రోజుకు కనీసం 10-12 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి. రెండవది ఎండలోంచి వచ్చిన ప్రతిసారీ చల్లని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. దీంతో పాటు బాదం, పచ్చి పాలు, నిమ్మ, పసుపు, నిమ్మ, తేనె ఇలా పలు ప్రక్రియల ద్వారా వేసవిలో ఎదురయ్యే చర్మ సమస్యల్ని పరిష్కరించవచ్చు. బాదం పౌడర్ ఎప్పటికప్పుడు పాలలో నానబెట్టి..ఈ మిశ్రమంలో పసుపు కలిపి ముఖానికి 20 నిమిషాలు రాసి ఉంచుకోవాలి. ఆ తరువాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి కనీసం 2 సార్లు చేయడం వల్ల డెడ్ స్కిన్ సమస్యతో పాటు బ్లాక్ నెస్ కూడా దూరమౌతుంది. చర్మం లోపల్నించి మాయిశ్చరైజ్ కావడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. ట్యానింగ్ నిర్మూలించబడుతుంది.
ఇక మరో పద్ధతి నిమ్మ, పసుపు మిశ్రమం. పాలలో ఉండే మీగడ చర్మానికి చాలా చాలా మంచిది. ఇది చర్మాన్ని అత్యంత సురక్షిత పద్ధతిలో మాయిశ్చరైజ్ చేస్తుంది. మీగడలో పసుపు, నిమ్మరసం కొద్దిగా కలిపి రాయాలి. వారానికి కనీసం 3-4 సార్లు ఇలా చేయడం వల్ల ట్యానింగ్ సమస్య పోతుంది. ముఖం కాంతివంతంగా మారుతుంది.
మరో అద్భుతమైన అందరూ పాటించే చిట్కా నిమ్మ, తేనె మిశ్రమం. ఈ రెండింట్లోనూ ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖంపై నిమ్మ, తేనె మిశ్రమం రాయడం వల్ల ముఖానికుండే డ్రైనెస్ పోతుంది. ఎందుకంటే నిమ్మలో, తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇందుకు ఉపయోగపడతాయి. ఇతర చర్మ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి.
ముఖానికి యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే చర్మానికి నిమ్మరసం చాలా మంచిది. వేసవిలో నిమ్మరసం తాగడంతో పాటు..ఇందులో కొద్దిగా పసుపు రాసి ముఖానికి రాసుకుంటే చాలా మంచిది. దీనివల్ల వేసవిలో ప్రధానంగా ఎదుర్కొనే ట్యానింగ్ సమస్య పోతుంది. చర్మ కణాలు తెర్చుకుని చర్మం మరింత కాంతివంతమౌతుంది.
ఇక ఆయిల్ మస్సాజ్ ద్వారా చర్మ సమస్యలు తొలగించవచ్చు. ఆర్గాన్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ద్వారా చర్మ సమస్యల్ని దూరం చేయవచ్చు. ఈ ఆయిల్స్‌తో మస్సాజ్ చేయడం వల్ల డ్రైనెస్ పోతుంది. డైట్ కూడా మార్చుకోవాలి. నీటి పరిమాణం ఎక్కువగా ఉండే బొప్పాయి, పుచ్చకాయ, దోసకాయ, కీరా, ఆరెంజ్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
Also read: Jaggery Vs Sugar: మీ ఆరోగ్యానికి షుగర్ మంచిదా ? లేక బెల్లం మంచిదా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook