Soya Cutlet Recipe: సోయా కట్లెట్ చేయడం ఎంతో సులభం. మీల్ మేకర్ లతో రకరకాల కూరలను తయారు చేస్తాం. కానీ ఈ కట్లెట్ చేయడం వల్ల పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ కట్లెట్‌ని ట్రై చేయండి.
సోయా కట్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు:
వేడి నీళ్లు, మీల్ మేకర్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన కొత్తిమీర, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఉడికించిన బంగాళాదుంపలు, బియ్యంపిండి, మైదాపిండి, బ్రెడ్ క్రంబ్స్, నూనె
సోయా కట్లెట్స్ తయారీ విధానం:
ముందుగా వేడి నీళ్లల్లో ఉప్పు వేసికలపాలి. తరువాత మీల్ మేకర్స్ వేసి నానబెట్టుకోవాలి. తరువాత వీటిని చేత్తో నీరంతా పోయేలా పిండి జార్ లో వేసుకోవాలి. ఈ మీల్ మేకర్ లను బరకగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. బంగాళాదుంపలను మెత్తగా చేసి వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. తరువాత కొద్దిగా నీటిని వేసుకుని అంతా బియ్యం పిండి వేసి కలిసేలా కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని తీసుకుంటూ కట్లెట్ ల ఆకారంలో వత్తుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత మైదాపిండిని తీసుకుని తగినన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. కట్లెట్ లను మైదాపిండి మిశ్రమంలో ముంచి ఆ తరువాత బ్రెడ్ క్రంబ్స్ తో కోటింగ్ చేసుకోవాలి. తరువాత ఈ కట్లెట్ ను వేడి నూనెలో వేసి కాల్చుకోవాలి. దీఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సోయా కట్లెట్స్ తయారవుతాయి.
Also Read Strong Bones: వయస్సుతో పాటు ఎముకలు పటుత్వం కోల్పోతున్నాయా, ఇలా చేయండి చాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter