Benefits Of Peanuts: పల్లీలు తిండే పదికాలాలు ఆరోగ్యంగా ఉంటారు తెలుసా?

Health Benefits of Peanuts | పల్లీలు..ప్రతీ ఇంట్లో సులభంగా లభిస్తాయి. ఆరోగ్యం కోసం చాలా మంచివి కూడా. ముఖ్యంగా ఈ కాలంలో. ఎందుకంటే ఇప్పుడు రోజురోజుకూ చలిపెరుగుతోంది. 

Last Updated : Dec 14, 2020, 04:39 PM IST
    1. పల్లీలు..ప్రతీ ఇంట్లో సులభంగా లభిస్తాయి.
    2. ఆరోగ్యం కోసం చాలా మంచివి కూడా. ముఖ్యంగా ఈ కాలంలో.
    3. ఎందుకంటే ఇప్పుడు రోజురోజుకూ చలిపెరుగుతోంది.
Benefits Of Peanuts: పల్లీలు తిండే పదికాలాలు ఆరోగ్యంగా ఉంటారు తెలుసా?

Peanuts Advantages | పల్లీలు..ప్రతీ ఇంట్లో సులభంగా లభిస్తాయి. ఆరోగ్యం కోసం చాలా మంచివి కూడా. ముఖ్యంగా ఈ కాలంలో. ఎందుకంటే ఇప్పుడు రోజురోజుకూ చలిపెరుగుతోంది. ఇలాంటి సమయంలో పల్లీలు పేదవారి డ్రై ఫ్రూట్స్‌లా పని చేస్తాయి. 

ఇవి మార్కెట్లో విరివిగా లభిస్తాయి. దీన్ని మధ్యతరగతి బాదాం (Badam) అని కూడా అంటారు. ఇందులో ఎన్నో పోషకతత్వాలు ఉంటాయి. వెంటనే శక్తిని అందించగలుగుతుంది. దీని వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ALSO READ| Saffron: కుంకుమపువ్వు అంత కాస్ట్ లీ ఎందుకో తెలుసా ? 

పల్లీలు ఎప్పుడు తినాలంటే...
పల్లీలు తినే అత్యంత ఉత్తమమైన సమయం ఏదంటే.. అది చలికాలమే (Winter). ఈ కాలమే పల్లీలు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది. వీటిని జీర్ణించుకోవడం కూడా చాలా సులభం.

పల్లీల వల్ల కలిగే లాభాలు
వేరుశనగల్లో ఎన్నో విటమిన్స్, న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటి వల్ల శక్తి లభిస్తుంది. ఇందులో విటమిన్ బీ కాంప్లెక్స్, నియాచిన్, రిబోఫ్లోవిన్, థియామిన్, విటమిన్ బీ6, పెంటోథెనిక్ యాసిడ్ ఉంటాయి.

మరిన్న ప్రయోజనాలు
వేరుశనగలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక గుడ్డులో ఉండే ప్రోటీన్ అందులో ఉంటాయి. ఒక గ్లాసు పాలలో ఉండే పోషకాలు ఉంటాయి.

ALSO READ|  Driving at Night: డ్రైవింగ్ చేస్తోంటో నిద్ర వస్తోందా? ఇలా చేయండి

మోనో ఇన్ శాట్యురేటెడ్...
పల్లీల్లో మోనో ఇన్ శాట్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అధికంగా లభిస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌‌ను నాశనం చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది.

చలి కాలం పల్లీలు తినడం వల్ల కలిగే లాభాలు
చలికాలం వేరుశనగలు తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. జలుబు, దగ్గు తగ్గుతాయి. శ్వాస సంబంధిత సమస్యలు తొలగుతాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. బాదాంలో ఉండే పోషకాలు ఇందులో ఉంటాయి. శరీరంలో రక్తహీనతను నివారిస్తుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News