Vaginal Itching Home Remedies: సాధారణంగా మనలో చాలామంది మంది యోనిలో దురద, చికాకు, పొడిబారడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. దీని కారణంగా మంట, దుర్వాసన కలుగుతుంది. ఈ సమయంలో చాలా మంది చికత్స, మందులు ఉపయోగిస్తారు. మరి కొందరికి ఏం చేయాలి అనే ప్రశ్నలు కలుగుతాయి. అయితే గైనకాలజిస్టుల ప్రకారం ....
సమ్మర్ సీజన్‌లో చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా ప్రైవేట్ పార్ట్స్‌లో తీవ్రమైన మంట, దురద, చికాకు, దుర్వాసన వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఈ సమయంలో వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. కొంతమంది వైద్యులను కలవడానికి ఇబ్బంది పడుతుంటారు. అయితే మీరు వైద్యులను సంప్రదించకుండా కూడా వారు తెలిపే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా వేసవికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
సమ్మర్‌లో చాలా నీరు తీసుకోకుండా ఉంటారు. దీని వల్ల శరీరం ఉష్ణోగ్రత్తలు పెరుగుతాయి. దీని కారణంగా ప్రైవేట్ పార్ట్స్‌లో దురద, మంట కలుగుతుంది. కాబట్టి శరీరానికి కావాల్సిన నీరు తీసుకోవడం వల్ల ఈ సమస్య బారిన పడకుండా ఉంటారు. కనీసం రోజులో ఏనిమిది నుంచి పది గ్లాసుల నీటిని తీసుకోవాల్సి ఉంటుంది.
వేడి ఆహారపదార్థాలు కాకుండా చలటి పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది. దీని వల్ల శరీర ఉష్ణోగ్రత్తలు పెరగకుండా ఉంటాయి. ముఖ్యంగా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవడం మంచి. వాటర్ కంటెంట్ పండ్లు, కూరగాయాలు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. అలాగే వైద్యుల ప్రకార చెమట కారణంగా ప్రైవేట్ పార్ట్స్ ప్రాంతంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల వివిధ బ్యాక్టీరియా, ఈస్ట్ పెరుగుదలకు కారణం అవుతుంది. కాబట్టి ఎలాంటి సమయంలో బిగుతుగా బట్టలు కాకుండా తేలికపాటి బట్టలు వేసుకోవడం చాలా మంచిది. ఇన్నర్ వేర్ కూడా కాటన్ లో దుస్తులు వేసుకోవడం చాలా మంచిది. దీని వల్ల గాలి తగులుతుంది. చెమట రాకుండా ఉంటుంది.
మీరు ప్రైవేట్ పార్ట్స్‌లో తీవ్రమైన మంట, దురద, యూరిన్‌లో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్యానిపుణులును సంప్రదించాల్సి ఉంటుంది. వారు పరీక్షలు చేసి మందులు ఇస్తారు. క్రమం తప్పకుండా పాటించడంలో వల్ల సమస్య తగ్గుతుంది. వేసవిలో శరీరం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది. పైన చెప్పిన వాటిని పాటించడం వల్ల సమస్య తగ్గుతుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి