Fiber Rich Foods For Weight Loss: మన శరీరం రోజు యాక్టివ్‌గా ఉండడానికి ప్రోటీన్లు విటమిన్స్ ఖనిజాలు అధిక మోతాదులో ఉండే ఆహారాలను తీసుకోవడం ఎంతో అవసరం దీంతో పాటు ఫైబర్‌తో కూడిన ఆహారాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారాలు మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు, పొట్ట సమస్యలు రాకుండా ఉండడానికి కీలక పాత్ర పోషిస్తాయి. ఫైబర్‌తో కూడిన ఆహారాలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరం కూడా చాలా దృఢంగా మారుతుంది. అందుకే పొట్ట సమస్యలతో బాధపడే వారిని వైద్య నిపుణులు తరచుగా ఫైబర్ అధిక మోతాదులో లభించే ఆహారాలను తీసుకోమని సూచిస్తారు.
నిజానికి ఫైబర్ కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు కొలెస్ట్రాల్ నియంత్రించుకోవాలనుకునేవారు తప్పకుండా ఆహారాల్లో రుణ ధాన్యాలు ఇతర పండ్లు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఫైబర్ మొక్కల ఆధారిత ఆహారాల్లో కూడా ఎంతగానో లభిస్తుంది. ఇదిలా ఉండగా ఫైబర్ రెండు రకాలుగా లభిస్తుంది. అందులో మొదటిది కరిగే ఫైబర్ అయితే, రెండవది మాత్రం కరగని ఫైబర్.. ఇవి రెండు జీర్ణ క్రియకు ఎంతగానో మేలు చేస్తాయి. మీరు కూడా ఎంతో సులభంగా పొట్ట సమస్యలను తగ్గించుకోవడంతో పాటు బరువు తగ్గాలనుకుంటున్నారా? తప్పకుండా ఈ కింది ఫైబర్ ఫుడ్స్ తీసుకోండి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
బెర్రీస్:
బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్, రాస్ప్బెర్రీస్, స్ట్రాబెర్రీస్‌తో పాటు బ్లాక్బెర్రీస్ వంటి రకాల బెర్రీలలో ఫైబర్ అధిక మోతాదులో లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతిరోజు తీసుకునే అల్పాహారంలో భాగంగా కలిపి తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఇందులో ఉండే గుణాలు పొట్ట సమస్యలను దూరం చేసేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. బెర్రీలను స్మూతీ ఓట్స్ ఏదైనా సలాడ్స్‌లో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అధిక మోతాదులో ఫైబర్ లభిస్తుంది.
అవోకాడో:
అవోకాడోలో కూడా ఎక్కువ పరిమాణంలో ఫైబర్ లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో మంచి కొవ్వులతో పాటు ఖనిజాలు విటమిన్ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు అల్పాహారంలో భాగంగా దీనిని తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. దీంతోపాటు ఇందులో విటమిన్లు C, E, K, B6 అలాగే రిబోఫ్లావిన్, నియాసిన్, ఫోలేట్లు కూడా ఎక్కువ మోతాదులో లభిస్తాయి. దీనిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని కారణంగా జీర్ణక్రియ సమస్యలు రాకుండా కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి