డయాబెటిస్‌కు చెక్ పెట్టే జామ, కొబ్బరి నీళ్ల మిశ్రమం.. ఓ లుక్కేయండి!

ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడ కూడా డయాబెటిస్‌కు శాశ్వత చికిత్స కనుగొనబడలేదు. కానీ డయాబెటిస్‌ను నియంత్రించి.. సరైన పద్ధతుల్లో నిర్వహించటం చాలా అవసరం. ఈ మిశ్రమంతో డయాబెటిస్‌ను కాస్త వరకైనా నియంత్రిచవచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 16, 2023, 09:21 PM IST
డయాబెటిస్‌కు చెక్ పెట్టే జామ, కొబ్బరి నీళ్ల మిశ్రమం.. ఓ లుక్కేయండి!

జీవితంలో ఒక్క్కసారి డయాబెటిస్ కి గురైతే.. జీవితాంతం మందులు వాడాల్సిందే!  ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడ దీనికి చికిత్సని లేదు. శరీరంలో ప్లీహ గ్రంథి నుండి తగినంత ఇన్సులిన్‌ను తయారవ్వనపుడు డయాబెటిస్ కలుగుతుంది. దీని కారణంగా రక్తపోటు నియంత్రణలో లేకుండా పోతుంది మరియు కణాలలో నిల్వ చేయబడదు. డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు వారి ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించకపోతే అనేక ఇతర వ్యాధుల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది. కావున సరైన డైట్ ని ఎంచుకొని నిరంతరం ఆ డైట్ ని అనుసరించడం అవసరం.  

డయాబెటిస్ రోగులు తాగవలసిన డ్రింక్స్
కొన్ని స్పెషల్ డ్రింక్ తాగడం వల్ల డయాబెటిస్ కలిగిన వారికి.. వారి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల బరువు పెరగడం,గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుందని భారతదేశ ప్రముఖ పోషకాహార నిపుణులు నిఖిల్ వాట్స్ తెలిపారు. 

జామకాయ, కొబ్బరి నీళ్ల వల్ల కలిగే లాభాలు  
డయాబెటిస్ ఉన్నవారికి జామకాయ మరియు కొబ్బరి నీళ్లతో ఒక డ్రింక్ ని తయారు చేయవచ్చు. కాలంతో సంబంధం లేకుండా.. 
ఇది ప్రతి కాలంలో ఉపయోగకరం. జామకాయ మరియు కొబ్బరి నీళ్ల వల్ల కలిగే లాభాలు అందరికి తెలిసిందే. కానీ,ఈ రెండిటిని కలిపి చేసే డ్రింక్ డయాబెటిస్ వంటి వ్యాధులపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది.  

డయాబెటిస్ వ్యాధిపై కొబ్బరి నీళ్ల ప్రభావం
కొబ్బరి నీళ్లలో అధికంగా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇది శరీరంలో pH స్థాయిని సమతుల్యం చేయటమే కాకుండా.. జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. కొబ్బరిలో సహజమైన చక్కరలు లభిస్తాయి, అలాగే కొబ్బరి ఫైబర్ మరియు ప్రోటీన్ యొక్క గొప్ప మూలం. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీని కారణంగా చెడు కొలెస్ట్రాల్ కూడా నియంత్రించబడుతుంది మరియు మధుమేహం వ్యాధి నుండి తాత్కాలికంగా ఉపశమనాన్ని కలిగిస్తుంది కలిగిస్తుంది. 

Also Read: Pravallika Death: ప్రవళ్లిక ఆత్మహత్యపై మంత్రి కేటీఆర్ కామెంట్స్.. కాంగ్రెస్ స్ట్రాంగ్ రిప్లై  

రక్తపోటుని నియంత్రించే జామ
జామపండులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. డయాబెటిక్ వారు తీసుకునే డైట్ లో ఇది తప్పనిసరి. ఇందులో సోడియం, కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. అలాగే పొటాషియం మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కావున, ఇది రక్తంలో చక్కెర స్థాయిని సులభంగా నియంత్రించడంలో సహాయపడుతుంది. 

జామకాయ - కొబ్బరి నీళ్ల తయారీ
ముందుగా 2 నుంచి 3 జామపండ్లను తీసుకొని తొక్క తీసి దానిని గ్రైండ్ చేసి వడకట్టి విత్తనాలను వేరు చేయాలి. తర్వాత ఆ జ్యూస్ లో ఒకటి లేదా ఒకటిన్నర కప్పుల కొబ్బరి నీళ్లు పోసి కలిపి అందులో నిమ్మరసం మరియు ఒక చెంచా అల్లం పేస్ట్ ని కలపాలి. రుచిని కోసం అయితే కొన్ని తులసి ఆకులను మెత్తగా దంచి పైన అలంకరించి దానికి అల్పాహారంగా తీసుకోవాలి.

Also Read: Cricket in Olympics: వందేళ్ల తరువాత 2028లో తిరిగి ఒలింపిక్స్‌లో క్రికెట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

Trending News