Hyderabad Rains: డేంజర్ లో హైదరాబాద్.. ఉప్పొంగిన ఈసీ, మూసీ..

Hyderabad Rains: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్  జంట జలాశయాలతో పాటు హుస్సేన్ సాగర్ నిండు కుండలను తలపిస్తున్నాయి. దీంతో ఈ జలాశయం పరిసర ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. 

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 2, 2024, 10:00 AM IST
Hyderabad Rains: డేంజర్ లో హైదరాబాద్.. ఉప్పొంగిన ఈసీ, మూసీ..

Hyderabad Rains: తెలంగాణ, ఏపీల్లో వరుణుడు కుమ్మి పడేస్తున్నాడు. అల్ప పీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. మరోవైపు విజయవాడ పరిసర ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. మరోవైపు హైదరాబాద్ నగరంలో వరుణుడి ప్రభావంతో జంట జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఇప్పటికే  జంట జలాశయాల్లో ఒక్కటైన గండిపేట (ఉస్మాన్ సాగర్ ) పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులుగా ఉంది. మరోవైపు (3.9000 టీఎంసీ) నీటి నిల్వ సామర్ధ్యం ఉంది.ఈ రోజు కురిసిన వర్షాలకు ప్రస్తుత నీటి 1784  అడుగులకు చేరింది. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ కు 6 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. ప్రస్తుతానికి ఔట్ ఫ్లో లేదు.  ప్రస్తుతం నీటి నిల్వ 2.506 టీఎంసీలు ఉంది.  ఈ రోజు కూడా భారీ వర్షాల నేపథ్యంలో ఏ క్షణమైన ఉస్మాన్  సాగర్ పూర్తి స్థాయి నీటి సామర్ధ్యానికి చేరకునే అవకాశాలున్నాయి.దీంతో ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.  దీంతో గండిపేట పరివాహాక ప్రాంత ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

అటు హిమాయత్ సాగర్ నీటి నిల్వ సామర్ధ్యం 1763.50 అడుగులు ఉంది. ఇక్కడ పూర్తి నీటి సామర్ధ్యం 2.970 టీఎంసీలుంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం 1758 అడుగుల మేర ఉంది. మరోవైపు జలశయంలో నీటి సామర్ధ్యం 2 టీఎంసీల వరకు ఉంది. హిమాయత్ సాగర్ ఇన్ ఫ్లో 3500 క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతానికి ఔట్ ఫ్లో లేదు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వరకు కానీ.. రేపటి వరకు కానీ పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకునే అవకాశాలున్నాయి. అపుడు హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువ మూసీలోకి ఒదలనున్నారు. మరోవైపు హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది.

మరోవైపు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ కూడా నిండు కుండను తలపిస్తోంది. ఈ రోజు సాయంత్రం కానీ.. రేపు కానీ .. ట్యాంక్ బండ్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశాలున్నాయి. దీంతో గాంధీ నగర్, ఇందిరా పార్క్, కవాడి గూడ ప్రాంతాలు వరద ప్రవాహానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు ప్రజలు వాగులు, వంతెనలను ఎక్కి సెల్పీలు తీసుకుంటూ ప్రమాదాల బారిన పడుతున్నారు. వర్షాలు పడుతున్న ఇలాంటి సమయంలో ఎవరైనా.. బ్రిడ్జి, వంతెనలపై ఇలాంటి సెల్ఫీలు తీసుకోవడం వంటివి చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడైనా బ్రిడ్జి, వంతెన కొట్టుకుపోతే జరిగే ప్రాణ నష్టం తీవ్రంగా ఉంటుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో వాగులు, చెరువులు, ప్రాజెక్ట్ ల వైపు వెళ్లవద్దని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. ముఖ్యంగా సెల్ఫీలు, ఫోటోగ్రాఫ్ ల మోజుల పడి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని చెబుతున్నారు. 

ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News