7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీకి బిగ్ సర్‌ప్రైజ్.. జీతం ఎంత పెరగనుందంటే..?

7th Pay Commission DA Hike: డీఏ పెంపు ఎప్పుడు ఉండనుంది..? కేంద్ర ప్రభుత్వం ఎంత జీతం పెంచనుంది..? హోలీకి అయినా ప్రభుత్వం కానుక ఇస్తుందా..? ఇలా అనేక రకాలు ఆలోచిస్తున్న ఉద్యోగుల ఎదురుచూపులకు త్వరలో చెక్ పడనుంది. హోలీకి ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.  

Last Updated : Mar 2, 2023, 11:09 PM IST
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీకి బిగ్ సర్‌ప్రైజ్.. జీతం ఎంత పెరగనుందంటే..?

7th Pay Commission DA Hike: దేశంలోని లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు హోలీకి ముందే గిఫ్ట్ వచ్చింది. ప్రభుత్వం ఉద్యోగుల జీతాలను పెంచింది. కరువు భత్యం పెంపునకు మోదీ కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ఈ ఆమోదం తర్వాత ఉద్యోగుల జీతం రూ.27 వేలకు పైగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉద్యోగులకు 38 శాతం డియర్‌నెస్ అలవెన్స్ లభిస్తుండగా.. ఇప్పుడు అది 4 శాతానికి పెరగనుందని సమాచారం. డియర్‌నెస్ అలవెన్స్ ఏఐసీపీఐ ఆధారంగా నిర్ణయిస్తున్న విషయం తెలిసిందే.

ఎంత జీతం పెరుగుతుంది..?

ఉదాహరణకు ఉద్యోగి బేసిక శాలరీ రూ.18 వేలు అయితే.. అతని జీతంలో నెలకు రూ.720 పెరుగుతుంది. ఉద్యోగుల జీతంలో ఏడాదికి రూ.8640 పెరుగుతుంది. ఉద్యోగి బేసిక్ వేతనం నెలకు రూ.56900 ఉంటే.. వారి జీతం నెలకు రూ.2276 పెరగనుంది. అంటే వార్షిక ప్రాతిపదికన రూ.27,312 పెరుగుతుంది. జీతం పెంపుపై ప్రభుత్వం నుంచి త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ప్రధాని మోదీ హోలీకి ముందు డీఏ పెంపుపై ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. హోలీ తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది. మార్చి నెల జీతంతో పాటు పెంచిన డియర్‌నెస్ అలవెన్స్ కూడా చెల్లించాలి. ఉద్యోగులకు రెండు నెలల బకాయిలు కూడా అందుతాయి. అంటే జనవరి నెల నుంచి పెరిగిన డీఏ అమలవుతుంది. 

అదేవిధంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచాలని కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌లోనూ కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతంగా ఉంది. దీనిని 3.68 శాతానికి పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్‌ను నెరవేరిస్తే బేసికి శాలరీ రూ.18 వేల నుంచి రూ.26 వేలు అవుతుంది.  

Also Read: Bank Employees Holidays: బ్యాంక్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రెండు వీక్లీఆఫ్‌లు..?   

Also Read: Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వానికి జనసేన సపోర్ట్.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: పవన్ కళ్యాణ్‌  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News