7th Pay Commission: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. పెండింగ్ డీఏపై షాకింగ్ నిర్ణయం

Latest Update On Pending DA: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్. పెండింగ్ డీఏ బకాయిలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉంచిన 18 నెలల కరువు భత్యం నిధులు విడుదల చేయట్లేదని స్పష్టం చేసింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 15, 2023, 09:12 AM IST
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. పెండింగ్ డీఏపై షాకింగ్ నిర్ణయం

7th Pay Commission Latest Update On Pending DA: ఈ ఏడాది జనవరి నెలకు సంబంధించి డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు కోసం కేంద్ర ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. బుధవారం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో డీఏ పెంపునకు ఆమోదం లభించే అవకాశం ఉంది. అయితే పెండింగ్ డీఏ బకాయిల డిమాండ్‌పై ఉద్యోగులకు షాక్ తగిలింది. పాత డియర్‌నెస్ అలవెన్స్ బకాయిలను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. ఉద్యోగులకు మిగిలిన 18 నెలల కరువు భత్యం చెల్లించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
 
లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం ఈ సమాచారాన్ని అందించింది. కరోనా కాలంలో ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ నుంచి రూ.34,402.32 కోట్లు ఆదా చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ డబ్బును కోవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టడానికి వినియోగించారు. 2020లో కరోనా మహమ్మారి రాకతో కేంద్ ప్రభుత్వ ఉద్యోగులకు మూడు విడతల డీఏ పెంపు నిలిపివేసిన విషయం తెలిసిందే. జనవరి 2020, జూలై 2020, జనవరి 2021 తర్వాత డీఏలను పెండింగ్‌లో ఉంచింది.  జూలై 2021లో డీఏ పెంపును ప్రారంభించింది.

అయితే పెండింగ్‌లో ఉంచిన మూడీ డీఏలకు బదులు ఒకేసారి 17 శాతం పెంచింది. కానీ కరోనా కాలంలో నిలుపుదల చేసిన డబ్బులు మాత్రం ఉద్యోగులకు చెల్లించలేదు. 18 నెలల డీఏ బకాయిలు ఇవ్వాలని ఎంప్లాయీస్ యూనియన్ నిరంతరంగా డిమాండ్ చేస్తోంది. కానీ బకాయిలు చెల్లించేందుకు బీజేపీ ప్రభుత్వం నిరాకరించింది.

ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలోని నిబంధనలతో పోలిస్తే ప్రస్తుతం లోటు బడ్జెట్‌ రెండింతలు పెరిగిందని లోక్‌సభలో కేంద్రం తెలిపింది. దీంతో డీఏ బకాయిలను చెల్లించే ప్రతిపాదన లేదని పేర్కొంది. కరోనా సమయంలో విపత్తును ఎదుర్కోవటానికి ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రారంభించిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అన్నారు. ఇందుకోసం అవసరమైన డబ్బును డీఏ నిలిపివేసి చెల్లించినట్లు వెల్లడించారు. 

ప్రస్తుతం ఉద్యోగులకు 38 శాతం చొప్పున డీఏను పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నాలుగు శాతం పెంచితే 42 శాతానికి చేరుకుంటుంది. పెరిగిన జనవరి 2023 నుంచి అందుబాటులోకి వస్తుంది. కేంద్రం నుంచి ప్రకటన వస్తే.. ఈ నెల జీతంలో అకౌంట్‌లోకి నగదు జమ కానుంది. అదేవిధంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను కూడా పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌లోనూ కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతంగా ఉండగా.. 3.68 శాతానికి పెంచాలనే డిమాండ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్‌కు అంగీకరిస్తే.. బేసిక్ శాలరీ రూ.18 వేల నుంచి రూ.26 వేలకు పెరుగుతుంది.

Also Read: TSPSC Paper Leak: పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలక మలుపు.. గ్రూప్ 1 పేపర్ కూడా లీక్..?

Also Read: Maruti Brezza: రూ.3 లక్షలకే ఈ కారు తీసుకెళ్లండి.. ఎగబడికొంటున్న జనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News