Unified Pension Scheme (UPS): 2004లో ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ పద్ధతి (NPS) పట్ల అసంతృప్తి ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూనిఫైడ్ పెన్షన్ పథకం (UPS) రూపంలో ఒక సరికొత్త అవకాశాన్ని ఇస్తున్నారు. ఈ యూనిఫైడ్ పెన్షన్ పథకం వచ్చే ఏడాది నుండి అమలులోకి రానుంది. పూర్తి పెన్షన్ పొందడానికి 25 సంవత్సరాల సేవ చేయాల్సి ఉంటుంది. అంటే, 2029 లేదా అంతకంటే తర్వాత రిటైర్ అయ్యే ఉద్యోగులకి పూర్తిగా పెన్షన్ పొందడానికి అర్హత ఉంటుంది.
25 సంవత్సరాలు పూర్తి చేయకముందే రిటైర్ అయ్యే ఉద్యోగుల పెన్షన్ ప్రో-రేటా పద్ధతిలో లెక్కించబడుతుంది. అయితే, కనీసం 10 సంవత్సరాల సేవ చేసిన వారికి కనిష్ఠ పెన్షన్ రూ.10,000గా నిర్ణయించారు. కానీ 8వ వేతన కమిషన్ అమలులోకి వచ్చిన తర్వాత 12 నెలల సగటు వేతనంలో 50% ఆధారంగా పెన్షన్ ఖరారు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కొత్త వేతన కమిషన్ అమలు చేస్తోంది కాబట్టి.. 2026లో 8వ వేతన కమిషన్ వస్తుంది అని చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం 7వ వేతన సంఘం కింద లెవల్ 1లో కనిష్ఠ వేతనం రూ.18,000 ఉండగా, అది రూ.34,560కు పెరుగుతుందని అంచనా. అలాగే, లెవల్ 18లో గరిష్ట వేతనం రూ.2.5 లక్షల నుండి రూ.4.8 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. UPS కింద, పెన్షన్ రిటైర్మెంట్‌కు ముందు 12 నెలల సగటు వేతనంలో 50% ఉంటుంది.
2026లో 8వ వేతన సంఘం అమలులోకి వస్తే.. లెవల్ 1లో కనిష్ఠ వేతనం రూ.34,560గా ఉండవచ్చు, అలాగే లెవల్ 18లో గరిష్ట వేతనం రూ.4.8 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. 2029 జనవరికి ప్రభుత్వ ఉద్యోగులు 20% డియర్నెస్ అలవెన్స్ (DA) కూడా వస్తుంది. అందువల్ల, లెవల్ 1లో ఉన్న ఉద్యోగులు రూ.34,560 వేతనంతో రూ.20,736 పెన్షన్ అందుకోవచ్చు. అలాగే లెవల్ 18లో ఉన్నవారు రూ.4.8 లక్షల వేతనంతో రూ.2,88,000 పెన్షన్ పొందవచ్చు.
Also read: September 1 New Rules: సెప్టెంబర్ 1 నుంచి 6 కీలక మార్పులు, ఏమేం మారనున్నాయో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook