రాహుల్ గాంధీతో పెళ్లి రూమర్స్‌పై స్పందించిన అదితి సింగ్

కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎమ్మెల్యే అదితి సింగ్‌తో రాహుల్ గాంధీకి వివాహమైనట్టు సోషల్ మీడియాలో పలు పుకార్లు షికార్లు చేస్తోన్న సంగతి తెలిసిందే.

Last Updated : May 6, 2018, 06:17 PM IST
రాహుల్ గాంధీతో పెళ్లి రూమర్స్‌పై స్పందించిన అదితి సింగ్

కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎమ్మెల్యే అదితి సింగ్‌తో రాహుల్ గాంధీకి వివాహమైనట్టు సోషల్ మీడియాలో పలు పుకార్లు షికార్లు చేస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ పుకార్లపై స్పందించిన సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితి సింగ్.. రాహుల్ గాంధీతో తనకు వివాహమైనట్టు వస్తోన్న పుకార్లను తీవ్రంగా ఖండించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయ్ బరేలీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న అదితి సింగ్‌తో రాహుల్ గాంధీకి వివాహమైందని, అందుకు సాక్ష్యం ఇదేనంటూ పలు ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే, అదంతా రాహుల్ గాంధీతోపాటు తన పరువు ప్రతిష్టలను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్ర మాత్రమే అని ఆమె కొట్టిపారేశారు. తాను రాహుల్ గాంధీకి రాఖీ కట్టానని, అతడు తనకు పెద్దన్నయ్యతో సమానం అని అదితి సింగ్ ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చారు. 

తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన అదితి సింగ్.. ''వాస్తవాలతో సంబంధం లేకుండా వ్యాపిస్తున్న పుకార్లను చూసి తనకు చాలా బాధేసింది'' అని ఆవేదన వ్యక్తంచేశారు. ''కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇమేజ్‌ని దెబ్బతీయడం కోసం జరుగుతున్న కుట్ర ఇది. దీని వెనుకున్నది ఎవరో ఊహించడం ఎవరికైనా పెద్ద కష్టమైన పనేమీ కాదు'' అని అన్నారామె. 

Trending News