హెల్మెట్ ధరించకుండా మోటార్ బైక్ నడిపినందుకు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ ప్రాంత ఎంపీ అలోక్ సంజర్ జరిమానా కట్టారు. ఓంకారేశ్వర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆదిశంకరాచార్య విగ్రహ నిర్మాణ ఆవశ్యకతపై మాట్లాడేందుకు ఏర్పాటు చేసిన ‘ఏక్తా యాత్రా’లో పాల్గొనేందుకు తన సహచరుడు సురేంద్రనాథ్ సింగ్తో కలిసి ఎంపీ బైక్ పై వెళ్తుండగా.. అది గమనించిన పోలీసులు ఆ వాహనాన్ని ఆపి జరిమానా కట్టాల్సిందిగా తెలిపారు. పోలీసుల సూచన ప్రకారం ఎంపీ రూ.250 జరిమానా కట్టి రసీదు తీసుకున్నారు. ఆ తర్వాత హెల్మట్ ధరించనందుకు ఆయన క్షమాపణ కూడా చెప్పారు. హెల్మట్ అనేది రోడ్డు ప్రమాదాల నుండి కాపాడడానికి ఒక రక్షణ లాంటిదని.. హెల్మట్ ధరించే అలవాటును అందరూ పెంచుకోవాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలను కోరారు.