రఫేల్ డీల్: రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు

రఫేల్ డీల్: రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు

Last Updated : Nov 16, 2019, 11:20 PM IST
రఫేల్ డీల్: రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు

న్యూఢిల్లీ: రఫేల్ డీల్ కేసు విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి రక్షణ శాఖ మంత్రిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం ద్వారా రాహుల్ గాంధీ విదేశాల్లో దేశం పరువు తీశారని ఆరోపిస్తూ నేడు బీజేపి దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపి నడ్డా ఇచ్చిన పిలుపు మేరకు దేశం నలుమూలలా పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసన ర్యాలీలు నిర్వహించారు. బీజేపికి, ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ రాహుల్‌కి వ్యతిరే నినాదాలు చేశారు. నిరాధారమైన ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీ బీజేపీపై అసత్య ప్రచారం చేస్తోందని బీజేపి శ్రేణులు మండిపడ్డాయి. రఫేల్ డీల్ వివాదంలో కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టేందుకు బీజేపి ఈ నిరసనలను ఓ వేదికగా ఎంచుకుంది. 

రఫేల్ డీల్ వివాదంలో గురువారం సుప్రీం కోర్టు నరేంద్ర మోదీ సర్కార్‌కి క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో శనివారం దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ శుక్రవారం బీజేపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపి నడ్డా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Trending News