మైనార్టీలో మోడీ సర్కార్ ! ఎలగెలగా ?

                                   

Last Updated : May 24, 2018, 01:22 PM IST
మైనార్టీలో మోడీ సర్కార్ ! ఎలగెలగా ?

2014 ఎన్నికల్లో సొంతగా మెజార్టీ సీట్లు కైవసం చేసుకొని 30 ఏళ్ల తర్వాత సొంతబలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీగా బీజేపీ అవతరించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను 282 సీట్లు సాధించింది. మిత్ర పక్షాల బలాన్నికలుపుకొని 336 సీట్లు సాధించి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవలె జరిగిన పరిణామాల కారణంగా బీజేపీ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. 

2014 నుంచి వివిధ కారణాల వల్ల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ బలం 282 నుంచి 272కు పడిపోయింది.  ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సీట్లు 273... అయితే ఇప్పుడు బీజేపీ సంఖ్యాబలం 272 మాత్రమే ఎంది. బీజేపీ ఎంపీలు యోగి ఆదిత్యనాథ్, కేశవ్ ప్రసాద్ మౌర్యలు రాజీనామా చేయగా..ఆ స్థానాలను బీజేపీ కోల్పోవడంతో బీజేపీకి బలం తగ్గడం మొదలైంది. అలాగే బీజేపీ ఎంపీల మరణంతో జరిగిన ఐదు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు గెలుపొందాయి. ఆపై ఓ బీజేపీ సస్పెండ్ చేసి మరో స్థానాన్ని కోల్పోయింది. ఇలా మొదలై కర్నాటక ఎన్నికలకు ముందు బీజేపీ 8 మంది ఎంపీల బలాన్ని కోల్పోయి సంఖ్యాబలం 274కి చేరింది. 

కర్నాటక ఎన్నికల సంధర్భంగా బీజేపీ ఎంపీలు యడ్యూరప్ప, శ్రీరాములు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో మోడీ సర్కార్ బలం 272కి పడిపోయింది. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప, శ్రీరాములు రాజీనామా అంశంపై పునరాలోచనలో పడ్డారు కమలనాథులు. ఎలాగో కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు కాబట్టి..యడ్యూరప్ప, శ్రీరాములు రాజీనామాలను వెనక్కు తీసుకుంటున్నట్టు లేఖ రాయించాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది.

మిత్రపక్షాల సపోర్ట్ ఉండటంతో ఇప్పటికిప్పుడు మోడీ ప్రభుత్వానికి ధోకా ఏమీ లేనప్పటికీ.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన క్రిడిట్ బీజేపీ కోల్పోతుంది. ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎదురీత తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. ఈ నేపథ్యంలో నష్టనివారణ చర్యలకు పూనుకుంటోంది బీజేపీ అధిష్టానం.

Trending News