Covishield Dose Schedule: దేశంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన మార్పులు చేస్తోంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ షెడ్యూల్‌లో మరోసారి మార్పులు చేసింది.
దేశంలో రెండు కంపెనీల వ్యాక్సినేషన్ జరుగుతోంది. సీరమ్ ఇనిస్టిట్యూట్(Serum Institute)కు చెందిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్‌కు చెందిన కోవ్యాగ్జిన్.ఈ రెండింటికి రెండు విభిన్నమైన డోసు షెడ్యూల్ ఉంది. ఇందులో కోవ్యాగ్జిన్ (Covaxin) డోసేజ్ ముందు నుంచీ ఒకే విధంగా ఉంది. మొదటి డోసు చేయించుకున్న 28 రోజుల తరువాత రెండవ డోసు వేయించుకోవల్సి ఉంటుంది. అయితే సీరమ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన కోవిషీల్డ్ (Covishield)మాత్రం తొలుత 28 రోజుల్నించి 6 వారాల్లోగా చేయించుకోవాలని మార్గదర్శకాలు వచ్చాయి. అనంతరం 6 వారాల్నించి 8 వారాలుంటే మంచిదని..షెడ్యూల్ మార్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధిని కేంద్ర ప్రభుత్వం (Central government)మరోసారి పెంచింది. రెండవ డోసును 12 నుంచి 16 వారాల మధ్యలో వేసుకోవాలని సిఫారసు చేస్తోంది.వ్యాక్సిన్ మెరుగైన ఫలితాల కోసం గ్యాప్ ఎక్కువగా ఉండాలని సూచించింది. కోవిడ్ పాజిటివ్ వచ్చినవారు ఆరు నెలల తరువాత వ్యాక్సిన్ తీసుకోవాలని నేషనల్ ఇమ్యునైజేషన్ టెక్నికల్ అడ్వైజర్ గ్రూప్ తెలిపింది. డెలివరీ అయిన మహిళలు మాత్రం ఎప్పుడైనా తీసుకోవచ్చని సూచించింది. కోవిషీల్డ్ రెండవ డోసుసు 12-16 వారాల తరువాత వేయించుకోవాలని చెబుతోంది.
Also read: India COVID19 Cases: దేశంలో వరుసగా రెండోరోజు 4 వేలకు పైగా COVID-19 మరణాలు నమోదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook