COVID-19 cases in West Bengal: అక్టోబర్ 1 నుంచి పశ్చిమ బెంగాల్‌లో సినిమా హాల్స్, ఓపెన్ ఎయిర్ థియేటర్స్ పునఃప్రారంభించుకునేందుకు అనుమతిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జి ( CM Mamata Banerjee ) ప్రకటించారు. అంతేకాకుండా వచ్చే నెల నుంచి మ్యూజిక్ షోలు, డ్యాన్సింగ్ ఈవెంట్స్, మ్యాజిక్ షోలకు ( musical, dance and magic shows ) కూడా అనుమతి ఇస్తామని మమతా బెనర్జీ స్పష్టంచేశారు. సాధారణ పరిస్థితులను తిరిగి తీసుకురావడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపిన మమతా బెనర్జీ.. ఏ కార్యక్రమంలోనైనా, థియేటర్లకైనా 50 మందికి మించి అనుమతించేది లేదని స్పష్టంచేశారు. భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి అన్ని కొవిడ్-19 నిబంధనలను విధిగా పాటించాల్సి ఉంటుందని ఆమె తేల్చిచెప్పారు. ట్విటర్ ద్వారా దీదీ ఈ వివరాలు వెల్లడించారు. Also read : Devendra Fadnavis, Sanjay Raut: హోటల్లో ఫడ్నవిస్, సంజయ్ రౌత్ భేటీ
To return to normalcy, Jatras, Plays, OATs, Cinemas & all musical, dance, recital & magic shows shall be allowed to function with 50 participants or less from 1 Oct, subject to adherence to physical distancing norms, wearing of masks & compliance to precautionary protocols.
— Mamata Banerjee (@MamataOfficial) September 26, 2020
కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) అధికమైన అనంతరం మార్చి నెలాఖర్లో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సినిమా థియేటర్లు మూసే ఉన్నాయి. దీంతో తాము ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నామని పలు భాషలకు చెందిన సినీ ప్రముఖులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. ఐతే కరోనావైరస్ ( Coronavirus ) ఉధృతి అధికంగా ఉన్న నేపథ్యంలో థియేటర్స్ ఇప్పటివరకు తెరుచుకోలేదు. Also read : KKR vs SRH match: మళ్లీ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్
పశ్చిమ బెంగాల్‌లో థియేటర్స్ తెరుచుకోనున్నాయట అనే వార్తకు ప్రస్తుతం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమ బెంగాల్లో కరోనా వైరస్ కేసులు ( Coronavirus cases in West Bengal ) తగ్గుముఖం పట్టాయా ? లేదంటే చిత్ర పరిశ్రమకు ఎదురవుతున్న నష్టాలను దృష్టిలో పెట్టుకునే సీఎం మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. Also read : Serum Institute: వ్యాక్సిన్ పంపిణీ కోసం 80 వేల కోట్లున్నాయా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe