Prashant Kishore to Join Congress : కాంగ్రెస్‌లోకి ప్రశాంత్‌ కిషోర్‌.. నేడో రేపో కీలక నిర్ణయం

Prashant Kishore Congress : కాంగ్రెస్‌లో ప్రశాంత్ చేరితే 2024 లోక్ సభ ఎన్నికల్లో పక్కాగా గెలవొచ్చని భావిస్తున్నందునే... కాంగ్రెస్ అధిష్టానం ప్రశాంత్ కిషోర్ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నేడో రేపో ప్రశాంత్ చేరికపై స్పష్టత రానుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 25, 2022, 04:57 PM IST
  • కాంగ్రెస్‌లో చేరనున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
  • పీకే చేరికపై 10జన్‌పథ్‌లో కాంగ్రెస్ కమిటీ సమాలోచనలు
  • నేడో రేపో ప్రశాంత్ చేరికపై కీలక ప్రకటన వెలువడే అవకాశం
Prashant Kishore to Join Congress : కాంగ్రెస్‌లోకి ప్రశాంత్‌ కిషోర్‌.. నేడో రేపో కీలక నిర్ణయం

Prashant Kishore to Join Congress : కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్ వరుసగా సమావేశమవుతున్నారు. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. దాదాపు 600 స్లైడ్‌ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో కాంగ్రెస్ 2024 ఎన్నికల్లో 370 లోక్‌సభ స్థానాల్లో గెలుపొందటానికి భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ప్రశాంత్ కిషోర్. కాంగ్రెస్ వ్యూహాలతోపాటు ప్రశాంత్ కిషోర్ మరికొద్ది రోజుల్లోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. ఈ నెలలో వరుసగా  కాంగ్రెస్ అగ్రనేతలతో  భేటీ అయి సుదీర్ఘ చర్చలు జరిపారు ప్రశాంత్ కిశోర్. తాజాగా ప్రశాంత్ చేరికపై స్పష్టతనిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కమిటీ భేటీ అయింది. కమిటీ సభ్యులు కేసీ వేణుగోపాల్, దిగ్విజయ్ సింగ్, అంబికా సోనీ, రణ్‌దీప్ సుర్జేవాలా, జైరామ్ రామేశ్, ప్రియాంక గాంధీ టెన్‌ జన్‌పథ్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ కమిటీ ఇప్పటికే ప్రశాంత్ చేరికపై సోనియాకు నివేదిక సమర్పించింది.  సమావేశంలో పార్టీని బలోపేతం చేసేందుకు పీకే అందించిన 600 స్లైడ్‌ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై సుదీర్థ చర్చ జరగనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

కిషోర్ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో వరుస సమావేశాలు జరపనుండగా, ఆమె కుమారుడు, పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ప్రశాంత్‌ కిషోర్ కాంగ్రెస్‌లో చేరే అంశంపై సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవాలో రేపో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆయన కాంగ్రెస్‌లో చేరే అంశంపై చర్చలు కేవలం గాంధీ కుటుంబీకులకు, కిషోర్‌కు మధ్య మాత్రమే ఉన్నాయని వారు చెప్పారు. కిషోర్ ఏప్రిల్ 16న, ఏప్రిల్ 18న కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. కిషోర్ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్ 2024 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది.

ఇప్పటికే  2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పక్కా రోడ్ మ్యాప్‌తో కూడిన వివరాలపై పూర్తి ప్రజెంటేషన్‌ను కిషోర్ అందించారని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కిషోర్ పాత్ర ఏంటనేది వారం రోజుల్లో తేలిపోతుందని గత వారమే ఆయన స్పష్టం చేశారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో 370 లోక్‌సభ నియోజకవర్గాలపై కాంగ్రెస్ దృష్టి పెట్టాలని కిషోర్ చెప్పారు. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశాలో కాంగ్రెస్ ఒంటరిగా పోరాడాలని.. అలాగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో పొత్తులు పెట్టుకోవాలని కిషోర్ తన ప్రజెంటేషన్‌లో సూచించారని,  రాహుల్ గాంధీ  అందుకు అంగీకరించారని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ఏడాది జరగనున్న గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ చేసుకుంటున్న సన్నాహాల నేపథ్యంలోనే.. కాంగ్రెస్ నేతలు, ప్రశాంత్ కిషోర్ మధ్య సమావేశాలు జరుగుతున్నాయి.

ఇటీవల ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత, కిషోర్‌తో మళ్లీ చర్చలు జరుపుతోంది కాంగ్రెస్. 2024 లోక్‌సభ ఎన్నికలలో సత్తా చాటాలని భావిస్తున్న కాంగ్రెస్‌కు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది. తిరిగి తన అవకాశాలను పునరుద్ధరించుకోవాలని, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), తృణమూల్ కాంగ్రెస్‌ల నుండి ఎదురవుతున్న సవాల్‌ను తిప్పికొట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చిన నేపథ్యంలో.. దేశంలో బీజేపీ వ్యతిరేక రాజకీయ వర్గాలకు కేంద్ర బిందువుగా కాంగ్రెస్ మాత్రమే ఉండాలని యోచిస్తోంది. ఆ దిశగానే ప్రశాంత్ వ్యూహాలు రచించారని, ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి, ఎక్కడ ఒంటరిగా పోరాటం చేయాలి అనే స్పష్టత ఇప్పటికే ఇస్తున్నందున, గెలుపు అవకాశాలు మరింత మెరుగవుతాయని భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో ప్రశాంత్ చేరితే పక్కాగా గెలవొచ్చని భావిస్తున్నందునే... కాంగ్రెస్ అధిష్టానం ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నేడో రేపో ప్రశాంత్ చేరికపై స్పష్టత రానుంది.

Also Read : Sara Bollywood Debut: బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సారా తెందూల్కర్.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్?

Also Read : Chiranjeevi Acharya : చిరంజీవి 'ఆచార్య' రన్‌ టైమ్‌‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. సినిమా నిడివి ఎంతంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News