Congress Official Twitter Account Locked: కాంగ్రెస్ పార్టీ అధికారిక ఖాతాను నిలిపేస్తూ...ట్విట్టర్ షాకిచ్చింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.
నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా కాంగ్రెస్ ఖాతాను లాక్ చేస్తున్నామని ట్విట్టర్(Twitter) పేర్కొన్నట్లు కాంగ్రెస్(Congress) వర్గాలు తెలిపాయి. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కాంగ్రెస్ పంచుకుంది. దేశంలో కాంగ్రెస్ నేతల ట్విట్టర్ ఖాతాల నిలిపివేత వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్ అధికారిక ఖాతా(Congress Official Twitter Account )తో పాటు సీనియర్ నేతలు, కార్యకర్తలకు చెందిన 5 వేల ఖాతాలను ట్విటర్ బ్లాక్ చేసినట్లు కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఆరోపించింది.
Also Read: రాజ్యసభలో కంటతడి పెట్టుకున్న వెంకయ్య నాయుడు
కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుజ్జేవాలా(Randeep Sujjewala) సహా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకిన్, లోక్‌సభలో ఆ పార్టీ విప్ మాణికం ఠాగూర్, కేంద్ర మాజీ మంత్రి జితేంద్ర సింగ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితాదేవ్ ట్విటర్ ఖాతాలు బ్లాక్ అయినట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు ట్విట్టర్ పనిచేస్తోందని ఏఐసీసీ సోషల్ మీడియా హెడ్ రోహన్ గుప్తా ఆరోపించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ట్విట్టర్ ఖాతాను లాక్ చేసిన కొన్ని రోజులకే ఇలా జరగడం గమనార్హం. కాగా.. దిల్లీలోని దళిత బాలిక హత్యాచారం కేసులో.. బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాలు బయటి ప్రపంచానికి తెలిసేలా.. ట్వీట్ చేసినందుకు రాహుల్ ఖాతాను బ్లాక్ చేస్తున్నట్లు ట్విట్టర్ స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ గత రాత్రి నుంచి ఎలాంటి పోస్టులను ట్విట్టర్లో చేయలేకపోతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook