దేశంలో ఒక్కరోజులో 19,459 కరోనా కేసులు, 380 మంది మృతి

భారత్‌లో కరోనా వైరస్(CoronaVirus) విజృంభిస్తోంది. ప్రతిరోజూ ప్రాణాంతక కరోనా కేసులు(COVID19 cases in India) పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. కేసులు దాదాపు 20వేల వరకు నమోదవుతున్నాయి.

Last Updated : Jun 29, 2020, 10:00 AM IST
దేశంలో ఒక్కరోజులో 19,459 కరోనా కేసులు, 380 మంది మృతి

దేశంలో కరోనా వైరస్(COVID19 cases in India) రోజురోజుకూ విజృంభిస్తోంది. ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకున్నా కరోనా కేసులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 19,459 కరోనా పాజిటివ్‌ కేసులు(CoronaVirus Cases) నమోదయ్యాయి. కాగా ఒకరోజు నమోదైన కేసుల్లో దేశంలో ఇప్పటివరకూ ఇది రెండో అత్యధికం కావడం విచారకరం. ‘ఊపిరి ఆడటం లేదు.. బై డాడీ’ కరోనా పేషెంట్ చివరి వీడియో

అదే సమయంలో గత 24 గంటల్లో దేశంలో 380 మంది కరోనాతో మరణించారు. తాజా మరణాలతో కలిపి దేశంలో ఇప్పటివరకూ కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 16,475కు చేరుకుంది. దేశంలో మొత్తం 5,48,318 కరోనా పాజిటివ్ కేసులు(India COVID19 Cases) నమోదు కాగా, అందులో చికిత్స అనంతరం 3,21,723 మంది ప్రాణాంతక కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 2,10,120 మంది ఆస్పత్రులలో కోవిడ్19కు చికిత్స పొందుతున్నారు. విషాదం: పెళ్లి తంతు ముగిసేలోగా వధువు మృతి

సోమవారం ఉదయం కేంద్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ
 

Trending News