Coronavirus death toll : 11,310 దాటిన కరోనా మృతుల సంఖ్య.. చైనా కంటే అక్కడే ఎక్కువ మరణాలు!

కరోనా వైరస్ (Coronavirus) శరవేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ సోకిన వారి సంఖ్య 2,72,351 దాటగా.. కరోనా కాటుకు బలైన వారి సంఖ్య 11,310 దాటింది. కోవిడ్ (COVID-19) బారిన పడిన దేశాల్లో చైనాను ఇటలీ మించిపోయింది.

Last Updated : Mar 21, 2020, 02:17 PM IST
Coronavirus death toll : 11,310 దాటిన కరోనా మృతుల సంఖ్య.. చైనా కంటే అక్కడే ఎక్కువ మరణాలు!

న్యూ ఢిల్లీ: కరోనా వైరస్ (Coronavirus) శరవేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,72,351 దాటగా.. కరోనా కాటుకు బలైన వారి సంఖ్య 11,310 దాటింది. కోవిడ్-19 (COVID-19) బారిన పడిన దేశాల్లో చైనాను ఇటలీ మించిపోయింది. ఇటలీలో కరోనాతో (Coronavirus in Italy) మృతి చెందిన వారి సంఖ్య 4,000 దాటింది. ఇటలీ అధికారిక గణాంకాల ప్రకారం గత 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 627 మంది చనిపోయారు. దీంతో ఇటలీలో మొత్తం మృతుల సంఖ్య 4,032కి చేరింది. కరోనా వైరస్ పుట్టిన చైనాలో (Coronavirus in China) సైతం ఇప్పటివరకు రికార్డైన మృతుల సంఖ్య 3,139 కాగా ఇటలీ ఆ సంఖ్యను దాటేసింది. 

ఇదిలావుండగా బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్‌సన్ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. రద్దీ ఉండే అన్ని సంస్థలు, స్థలాలను మూసేయాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. బ్రిటన్‌లోనూ కరోనా (Coronavirus in Britain) విజృంభిస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా ఎవ్వరూ ఇళ్లలోంచి వీధుల్లోకి రాకూడదని బ్రిటన్ సర్కార్ ఆంక్షలు విధించింది. బ్రిటన్‌లో 3,200 మందికిపైగా కరోనావైరస్ బాధితులు ఉండగా.. వారిలో 160 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఇక భారత్‌లో కరోనావైరస్ (Coronavirus in India) విషయానికొస్తే.. ఇప్పటివరకు ఉన్న చివరి అప్‌డేట్ ప్రకారం 271 మందికి కరోనా వైరస్ సోకింది. మహారాష్ట్రలోనే (Coronavirus in Maharashtra) అత్యధికంగా 63 ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా వైరస్ సోకిన వారిలో విదేశీయుల సంఖ్య కూడా భారీగానే ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News