DA Hike Hike for Employees: ఆరో వేతన సంఘం, ఐదవ వేతన సంఘం కింద జీతాలు పొందుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ఈ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచింది. అక్టోబరు నెలలో ఏడవ వేతన సంఘం పరిధిలోకి వచ్చే కేంద్ర ఉద్యోగుల డీఏను పెంచిన సంగతి తెలిసిందే. ఆరవ వేతన సంఘం పరిధిలోకి వచ్చే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (సీపీఎస్‌ఈ) ఉద్యోగులకు ప్రాథమిక వేతనంపై డియర్‌నెస్ అలవెన్స్‌ను ప్రస్తుత ఉన్న 221 శాతం నుంచి 230 శాతానికి పెంచింది. అంటే 9 శాతం పెంపుదల జరిగింది.
డియర్‌నెస్ అలవెన్స్ సవరించిన రేటు జూలై 1 2023 నుంచి అమలులోకి వస్తుంది. అదేవిధంగా ఐదో పే కమిషన్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ కూడా పెరిగింది. అలవెన్సులు పెరిగిన ఉద్యోగుల్లో రెండు వర్గాలు ఉన్నాయి. ప్రాథమిక వేతనంతో 50 శాతం డీఏ విలీనం ప్రయోజనం పొందని ఉద్యోగులు. ఆ ఉద్యోగులకు డీఏ ప్రస్తుత రేటు 462 శాతం నుంచి 477 శాతానికి పెరిగింది. అదే సమయంలో 50 శాతం డీఏను బేసిక్ వేతనంతో విలీనం చేయడం వల్ల ప్రయోజనం పొందిన ఉద్యోగులు. అటువంటి ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ ప్రస్తుత రేటు 412 శాతం నుంచి 427 శాతానికి పెరిగింది. ఈ విధంగా డీఏ 15 శాతం పెరిగింది.
దసరా, దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగు డీఏను కేంద్ర ప్రభుత్వం 4 శాతం పెంచిన విషయం తెలిసిందే. దీంతో 46 శాతానికి డీఏ చేరింది. సవరించిన రేటు జూలై 1, 2023 నుంచి అమలులోకి వచ్చింది. అంతకుముందు మార్చి నెలలో ఈ ఏడాది మొదటి డీఏను పెంచగా.. 38 శాతం నుంచి 42 శాతానికి పెరిగింది. వచ్చే ఏడాది జనవరిలో మరో డీఏ పెంపు ఉండనుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తుందని ఉద్యోగులు నమ్మకంతో ఉన్నారు.
Also Read: BRS-BJP Alliance: హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్-బీజేపీ పొత్తు ఉంటుందా, అమిత్ షా ఏమంటున్నారు
Also Read: AB De Villiers Team: ఏబీ డివిలియర్స్ దృష్టిలో బెస్ట్ ప్రపంచకప్ టీమ్ ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి