delhi cm atishi reacts on Arvind Kejriwal attack incident: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రిపై అర్వింద్ కేజ్రీవాల్ కు ఊహించని అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో కేజ్రీవాల్ పాదయాత్ర చేపట్టారు. దీంతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
అర్వింద్ కేజ్రీవాల్ పై ఒక ఆగంతకుడు దాడికి పాల్పడ్డాడు. ఆయనపై.. ఒక్కసారిగా.. లింక్ ను వేస్తు నినాదాలు చేశాడు. కేజ్రీవాల్ పై లిక్విడ్ వేసినట్లు తెలుస్తొంది. దీంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది.. ఒక్కసారిగా ఆగంతకుడిపై పిడిగుద్దులు కురిపించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
दिल्ली की जनता बहुत क्रोध में है
आज ग्रेटर कैलाश, न्यू दिल्ली में अरविंद केजरीवाल का लाली सत्कार होते होते रह गया 😌@sar402 @yagnaja #ArvindKejriwal pic.twitter.com/2AFz7bjdPO
— Rohit Jain (@Rohitjain2799) November 30, 2024
పాదయాత్రలో భాగంగా శనివారం (నవంబర్ 30) గ్రేటర్ కైలాష్‌లో ప్రాంతంలో పర్యటిస్తున్న కేజ్రీవాల్‌పై ఓ యువకుడు దాడి చేసినట్లు తెలుస్తొంది. మొదట భద్రత సిబ్బంది అదేదో యాసిడ్ ద్రావణం అనుకున్నారంట. దీంతో కేజ్రీవాల్ సైతం భయపడిపోయారంట. ఈ క్రమంలో.. అలర్ట్ అయిన.. భద్రత సిబ్బంది ఆగంతకుడిపై దాడి చేశాడు. దీనిపై ఢిల్లీ సీఎం అతిషీ సైతం రియాక్ట్ అయినట్లు తెలుస్తొంది.
కేజ్రీవాల్‌పై దాడికి పాల్పడింది బీజేపీ కార్యకర్తేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి కీలక వ్యాఖ్యలు చేశారు. సదరు నిందితుడు పీఎం మోదీతో ఉన్నఫోటో ఉన్నట్లు అతషీ ఆరోపించారు.
Read more: Girinagu: అమ్మబాబోయ్.. 12 అడుగుల భారీ గిరినాగు.. కళ్ల ముందే రక్త పింజరను.. ఒళ్లు గగుర్పొడిచే సీన్..
ఇదిలా ఉండగా.. నెల వ్యవధిలో.. 35 రోజుల వ్యవధిలో కేజ్రీవాల్‌పై మూడోసారి దాడి జరిగిందని ఆప్ నేతలు ఆరోపించారు. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో బీజేపీ వర్సెస్ ఆప్ గా మరోసారి మారినట్లు తెలుస్తొంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.