దేశ రాజధాని ఢిల్లీలో చలి వాతావరణం భయం పుట్టిస్తోంది. చలి ధాటికి రాజధాని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ(బుధవారం) ఉష్ణోగ్రతలు మరింత కనిష్టానికి పడిపోయాయి. ఉదయం పూట కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. పొగమంచు ధాటికి ముందు ఉన్న వస్తువులు ఏమీ కనిపించకుండా పరిస్థితి దిగజారింది.
#WATCH Delhi: Dense layer of fog on Barapullah flyover, this morning. pic.twitter.com/NhlqAzgUbb
— ANI (@ANI) January 22, 2020
దేశ రాజధాని ఢిల్లీలో మాత్రమే కాదు పంజాబ్, రాజస్థాన్, హరియాణా, ఉత్తర ప్రదేశ్, బీహార్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం 5 గంటలకు 30 మీటర్ల కంటే విజుబులిటీ తక్కువగా ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరో రెండు మూడు రోజులు పరిస్థితి ఈ విధంగానే ఉంటుందని హెచ్చరించింది. ఉదయం 8 గంటలు దాటినా సూర్యుని జాడ కనిపించడం లేదు. పొగ మంచు కారణంగా అంతా చీకటిగానే ఉంది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి కనిపించింది.
#WATCH Delhi: A dense layer of fog covers the national capital this morning. Visuals from Sarita Vihar. pic.twitter.com/njvMgHhRXF
— ANI (@ANI) January 22, 2020