Delhi Excise Policy Scam Case: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా లిక్కర్ మాఫియాతో కుమ్మక్కై అక్రమంగా కోట్ల రూపాయలు వెనకేసుకున్నారన్న కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తీగ లాగితే డొంక కదిలినట్టు ఈ కేసుతో హైదరాబాద్ లోనూ పలువురికి సంబంధాలు ఉన్నట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సైతం ఈ కేసుతో లింకులు ఉన్నట్టు ఆరోపణలు రావడం సంచలనం సృష్టించింది. ఇక తాజాగా ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీ కృష్ణతో పాటు డిప్యూటీ కమిషనర్ ఆనంద్ తివారిని సస్పెండ్ చేస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసింది.
ఇటీవలే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 వ్యవహారంలో తీవ్ర లొసుగులు ఉన్నాయని గుర్తించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. అందుకు బాధ్యులైన 11 మంది ఉన్నతాధికారులపై శాఖపరంగా కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు అవసరమైన అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ పాలసీ అమలు చేసిన అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణ, ఆయనకు సహకరించిన డిప్యూటీ కమిషనర్ ఆనంద్ తివారిలపై కన్నెర్ర చేస్తూ తాజాగా కేంద్ర హోంశాఖ వారిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ఏపీ, తెలంగాణకు సంబంధాలు ?
ఢిల్లీ ఎక్సైజ్ శాఖకు గతంలో కమిషనర్‌గా సేవలు అందించిన అరవ గోపీకృష్ణను కేంద్ర హోంశాఖ సస్పెండ్ చేయడంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ఏపీ, తెలంగాణకు సంబంధాలు ఉన్నాయని వినిపిస్తున్న ఆరోపణలకు మరోసారి బలం చేకూర్చినట్టయిందంటున్నారు పరిశీలకులు. తాజాగా కేంద్ర హోంశాఖ చేతిలో సస్పెన్షన్ వేటుకు గురైన ఐఏఎస్ ఆఫీసర్ అరవ గోపీ కృష్ణ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారే కాగా.. ఆయనకు ఏపీ, తెలంగాణలో అనేక మంది రాజకీయ ప్రముఖులు, వీఐపీలతో సత్సంబంధాలు కలిగి ఉండటమే అందుకు కారణం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam Case) సీబీఐ 13 మందిపై కేసులు నమోదు చేయగా.. అందులో గోపీకృష్ణ పేరు కూడా ఉంది. ఈ విచారణలో భాగంగానే తాజాగా ఆయన సస్పెన్షన్‌కి గురయ్యారు.
Also Read : Mlc Kavitha: కేసీఆర్ ను బద్నాం చేసేందుకు బీజేపీ కుట్ర.. లిక్కర్ స్కాంతో తనకు సంబంధం లేదన్న కవిత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి