Delhis air quality: దీపావళికి ముందే ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం

Delhi: Air quality slips to 'very poor' category ahead of Diwali: దీపావళి పండుగకు ముందే ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరిగింది. గాలి నాణ్యత కూడా తీవ్రంగా తగ్గినట్టు ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ రీసెర్చ్ వెల్లడించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2021, 11:49 AM IST
  • ఢిల్లీలో పెరిగిపోయిన వాయి కాలుష్యం
  • దీపావళి పండుగకు ముందే భారీగా పెరిగిన వాయి కాలుష్యం
  • తీవ్రంగా తగ్గిన గాలి నాణ్యత
Delhis air quality: దీపావళికి ముందే ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం

Delhi's air quality slips to 'very poor' category as farm fires pick up: దేశ రాజధాని ఢిల్లీలో వాయి కాలుష్యం పెరిగిపోయింది. దీపావళి పండుగకు ముందే ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరిగింది. గాలి నాణ్యత కూడా తీవ్రంగా తగ్గినట్టు ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ రీసెర్చ్ (System of Air Quality and Weather Forecasting and Research) (SAFAR) వెల్లడించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQ1) 302గా నమోదైందని పేర్కొంది. 

ఇక దీపావళి (Diwali) సందర్భంగా టపాసులు పేలిస్తే గాలి కాలుష్యం మరింత తీవ్ర స్థాయికి వెళ్లే ప్రమాదం ఉంది. అయితే గాలి కాలుష్యాన్ని నివారించేందుకు ఢిల్లీ ప్రభుత్వం (Government of Delhi) చర్యలు చేపట్టనుంది.

Also Read : RRR Movie Glimpse: ‘ఆర్ఆర్ఆర్’ నుంచి గ్లింప్స్ వచ్చేసింది.. వీడియో ఎలా ఉందంటే?

నవంబర్ 1, 2 తేదీల్లో ఢిల్లీలో గాలి నాణ్యత చాలా పేలవంగా ఉంటుందని సఫర్ అంచనా వేసింది. నవంబర్ 4 వరకు గాలి నాణ్యత చాలా తక్కువ స్థాయికి పడిపోవచ్చునని భారత వాతావరణ విభాగం (India Meteorological Department) (IMD) అంచనా వేసింది. నవంబర్ 5 నుంచి 6 తేదీల్లో గాలి నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే రోజుల్లో ఢిల్లీలోని (Delhi) పలు వాయుకాలుష్య ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాలతో గాలి నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని సఫర్ (System of Air Quality and Weather Forecasting and Research) (SAFAR)తెలిపింది.

Also Read : Commercial LPG Price Today: కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్పై రూ.266 పెంపు.. రూ.2000లకు చేరిన సిలిండర్ ధర

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News