Farmers protest: రైతులకు ఆ హక్కు లేదు..సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు

Farmers protest: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసన తెలిపే హక్కు రైతులకుందా లేదా అనే విషయంపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.

Last Updated : Dec 17, 2020, 05:06 PM IST
  • రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టులో కీలకమైన వ్యాఖ్యలు
  • సమ్మె చేయవచ్చు గానీ..రోడ్లను బ్లాక్ చేయవద్దని సూచించిన సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే
  • రైతుల వల్ల ఊర్లలో కోవిడ్ ముప్పు ఉందని చెప్పిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్
Farmers protest: రైతులకు ఆ హక్కు లేదు..సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు

Farmers protest: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసన తెలిపే హక్కు రైతులకుందా లేదా అనే విషయంపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం (Central government) తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు ( Agriculture acts ) వ్యతిరేకంగా గత 17 రోజులుగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. డిసెంబర్ 8న భారత్ బంద్ ( Bharat Bandh ) తలపెట్టి..నిరసన గళాన్ని విన్పించారు. అనంతరం జాతీయ రహదార్లను దిగ్భంధించారు. ఢిల్లీ నోయిడా సరిహద్దుల్లో ( Delhi Noida Border ) రైతుల ఉద్యమం సాగుతోంది. 

ఈ నేపధ్యంలో రోడ్లపై ఆందోళన చేస్తున్న రైతుల్ని అక్కడ్నించి ఖాళీ చేయించాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. రైతులకు తమ నిరసన తెలిపే హక్కుందని..కానీ రోడ్లను దిగ్భంధించి ఏ నగరాన్ని కూడా మూసివేయలేరని సుప్రీంకోర్టు ( Supreme court ) వ్యాఖ్యానించింది.

Also read: Note for Vote case: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు చేర్చనున్నారా

సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే వ్యాఖ్యల్లో..

మేం మిమ్మల్ని ఆందోళన చేయవద్దని అనడం లేదు. ఆపడం లేదు. నిరసన తెలుపండి.. కానీ నిరసనకు ఓ ఉద్దేశ్యముంటుంది. మీరు కేవలం ధర్నానే చేయకూడదు..చర్చలు కూడా జరపాలి..చర్చల కోసం ముందుకు రావాలి. రైతుల పట్ల మాకు కూడా ఆవేదన ఉంది. మేం కోరేది ఒకటే. అందరికీ ఆమోదయోగ్యమైన సమాధానం వెతకాలని.

పిటీషనర్ తరపున హరీష్ సాల్వే వాదన విన్పించారు. రైతుల ఆందోళన ( Farmers protest ) ప్రభావం రవాణాపై పడుతోంది. దాంతో ధరలు పెరుగుతున్నాయి. ఒకవేళ రోడ్లు మూసివేసుంటే ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆందోళన అంటే మరో నగరాన్ని బంద్ చేయడం కాదు కదా అని వాదించారు. 

రైతులకు ఆ హక్కు లేదు

అటు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ( Attorney general kk venugopal ) కూడా కీలక వ్యాఖ్యలు చేశారు కోర్టులో. రైతుల ఆందోళనలో ఏ ఒక్క రైతు కూడా మాస్క్ ధరించడం లేదని..పెద్ద సంఖ్యలో గుమిగూడారని..దీనివల్ల కోవిడ్ సంక్రమణ ప్రమాదం పొంచి ఉందన్నారు. రైతులు ఇక్కడ్నించి ఊర్లకు వెళ్లి అక్కడ కరోనా వ్యాధిని సంక్రమింపజేస్తారని..ఇతరుల మౌళిక అధికారాల్ని ఉల్లంఘించే హక్కు రైతులకు లేదని ఆయన చెప్పారు. 

Also read: GST: టీ బడ్డీ యజమాని కాదు..షాపింగ్ మాల్ యజమాని అట

Trending News