Agriculture Bill: బిల్లుకు వ్యతిరేకంగా రేపు భారత్ బంద్

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవసాయబిల్లుకు వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్త బంద్ జరగనుంది. దేశవ్యాప్తంగా 20కి పైగా రైతు సంఘాలు బంద్ కు మద్దతిచ్చిన నేపధ్యంలో భారత్ బంద్ ప్రాధాన్యత సంతరించుకుంది.

Last Updated : Sep 24, 2020, 09:31 PM IST
  • వ్యవసాయబిల్లుకు వ్యతిరేకంగా రేపే భారత్ బంద్
  • దేశవ్యాప్తంగా 20కి పైగా రైతు సంఘాల మద్దతు
  • వ్యవసాయ బిల్లును వెనక్కి పంపాలంటూ అధ్యక్షుడు రామ్ నాధ్ కోవింద్ కు విజ్ఞప్తి
Agriculture Bill: బిల్లుకు వ్యతిరేకంగా రేపు భారత్ బంద్

కేంద్ర ప్రభుత్వం ( Central Government ) కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవసాయబిల్లు ( Agriculture Bill ) కు వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్త బంద్ జరగనుంది. దేశవ్యాప్తంగా 20కి పైగా రైతు సంఘాలు బంద్ కు మద్దతిచ్చిన నేపధ్యంలో భారత్ బంద్ ( Bharat Bandh ) ప్రాధాన్యత సంతరించుకుంది.

దేశంలో వ్యవసాయ సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా వ్యవసాయ బిల్లును తీసుకొచ్చింది. ఈ  బిల్లు పార్లమెంట్ లో ఆమోదం కూడా పొందింది. ఈ క్రమంలో విపక్షాల నిరసనలతో పార్లమెంట్ ( Parliament ) రణరంగాన్నే తలపించింది. దేశవ్యాప్తంగా ఈ బిల్లుకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఆందోళన చేపట్టాయి. అటు ఈ బిల్లుపై ఓటింగ్ సందర్బంగా జరిగిన పరిణామాల నేపధ్యంలో సభ్యుల సస్పెన్షన్ కూడా చోటుచేసుకుంది. బిల్లును ఉపసంహరించుకోవాలంటూ విపక్షాలు పార్లమెంట్ సమావేశాల్ని కూడా బహిష్కరించాయి. 

ఈ క్రమంలోనే రేపు అంటే శుక్రవారం నాడు దేశవ్యాప్త బంద్ కు అఖిల భారతీయ రైతు కూలీ సంఘం పిలుపునిచ్చింది. దేశంలోని దాదాపు అన్ని రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. 20 వరకూ రైతు సంఘాలు బంద్ లో పాల్గొనబోతున్నాయి. ముఖ్యంగా అఖిల భారత రైతు సమాఖ్య ( AIFU ) , భారతీయ కిసాన్ యూనియన్ ( BKU ), అఖిల భారత కిసాన్ మహాసంగ్ వంట రైతు సంఘాలున్నాయి. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలోనూ పలు రైతు సంఘాలు షట్‌డౌన్‌కు పిలుపునిచ్చాయి. అటు ఏఐటీయూసీ, సీఐటీయూ, హిందూ మజ్ధూర్‌ సభ వంటి పలు కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. Also read: Narottam Mishra: మాస్కు ధరించను.. అయితే ఏమైంది?.. మంత్రి వ్యాఖ్యలపై దుమారం

మద్దతు ధర, ఆహార భద్రతను బహుళజాతి సంస్థలు, కార్పొరేట్ల గుప్పిట్లో పెడితే దేశవ్యాప్తంగా అలజడి రేగుతుందనేది ఆల్‌ ఇండియా కిసాన్‌ సంఘర్ష్‌ సమన్వయ కమిటీ చెబుతున్న మాట. వ్యవసాయ బిల్లును తిప్పిపంపాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ కు ( President Ramnath kovind ) ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లులను అడ్డుకోవాలంటూ 18 విపక్ష పార్టీలు బుధవారం రాష్ట్రపతిని కలిసి విన్నవించాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల ఆమోదంతో కనీస మద్దతు ధర లేకపోవడమే కాకుండా వ్యవసాయ మార్కెట్‌లు కనుమరుగవుతాయని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

అయితే ఈ బిల్లులు రైతులకు మేలు చేకూరుస్తాయని.. దళారీలు లేకుండా మెరుగైన ధరకు పంటను అమ్ముకునే వెసులుబాటు రైతులకు వస్తుందనేది కేంద్ర చెబుతున్న మాట. మరోవైపు రేపు జరగనున్న భారత్ బంద్ నేపధ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తమవుతోంది. Also read: Delhi CM Kejriwal: ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైంది

Trending News