Gold Price: బంగారం భగభగలు.. వెండిది అదే జోరు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) వరుసగా 9వ రోజు పెరిగాయి. మరోవైపు వెండి అయితే కరోనా కష్టకాలంలోనూ బులియన్ మార్కెట్ చరిత్రలోనే రికార్డు ధరలను నమోదు చేయడం గమనార్హం.

Updated: Jul 30, 2020, 07:35 AM IST
Gold Price: బంగారం భగభగలు.. వెండిది అదే జోరు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) వరుసగా 9వ రోజు పెరిగాయి. వెండి ధర సైతం బంగారం దారిలోనే పయనించింది. హైదరాబాద్‌ (Gold Price In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.370 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.55,310కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్లపై అంతే పెరగడంతో బంగారం 10 గ్రాముల ధర రూ.50,740కి పెరిగింది. Favivir: రూ.59కే కరోనా ట్యాబ్లెట్.. నేటి నుంచి మార్కెట్లోకి

ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు (Todays Gold Rate In Delhi) ఆకాశాన్నంటుతున్నాయి. నేడు మార్కెట్‌లో రూ.250 మేర ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,700 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,500కి చేరింది.  Pics: అందాల ఊర్వశివే.. గుండెల్లో గుచ్చావే.. 

బులియన్ మార్కెట్‌లో గత 10 రోజులలో వెండి ధర కేజీకి రూ.13,000 మేర పెరిగింది. తాజాగా వరుసగా ఐదో రోజు వెండి ధర పెరగింది. నేడు వెండి ధర రూ.50 మేర స్వల్పంగా పెరిగింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.66,050 అయింది. బులియన్ మార్కెట్ చరిత్రలోనే వెండి ధర ఇప్పటివరకూ ఇదే అత్యధికం.  పోకిరి లేడీ విలన్ Sheeva Rana Hot Photos వైరల్   
నితిన్, షాలిని పెళ్లి వేడుక ఫొటోలు