ప్రధాని మోదీ పనితీరుపై రాహుల్ ప్రోగ్రెస్ రిపోర్ట్

మాటలు చెప్పడంలో మేటి, తక్కువ శ్రద్ధతో క్లిష్ట సమస్యలతో పోటీపడుతుంటారు' అని రాహుల్ ట్వీట్ చేశారు.

Last Updated : May 26, 2018, 04:11 PM IST
ప్రధాని మోదీ పనితీరుపై రాహుల్ ప్రోగ్రెస్ రిపోర్ట్

ప్రధాని నరేంద్ర మోదీ నాలుగేళ్ల పాలనపై ప్రోగ్రెస్‌ను తెలియజేస్తూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గ్రేడ్‌లను ప్రకటించారు. 'వ్యవసాయం, విదేశీ విధానం, ఇంధన వనరులు, ఉద్యోగాల కల్పనలో మోదీ 'ఎఫ్' గ్రేడ్ అందుకున్నారు. కానీ వాగ్దానాలు చేయడంలో, వ్యక్తిగత ప్రమోషన్ లో ఏ+, యోగాలో 'బి-' గ్రేడ్ ఇచ్చారు. రెమార్క్స్: మాటలు చెప్పడంలో మేటి, తక్కువ శ్రద్ధతో క్లిష్ట సమస్యలతో పోటీపడుతుంటారు' అని రాహుల్ ట్వీట్ చేశారు.

 

అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ తన నాలుగేళ్ల పాలనపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోదీ దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తమ ప్రభుత్వంపై ఎనలేని విశ్వాసం కనబరుస్తున్న ప్రతి భారతీయుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. 'మీరు ఇస్తున్న మద్దతు, చూపిస్తున్న ప్రేమానురాగాలే మాకు కొండంత బలం. ఇదే అంకితభావంతో మున్ముందు ప్రజలకు సేవ చేస్తాం. ఈ నాలుగేళ్ళలో అభివృద్ధి ఓ ఉద్యమంలో మారింది' అని మోదీ ట్వీట్ చేశారు. దేశమే తనకు అన్నింటికంటే అతి ముఖ్యమైనదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత నాలుగేళ్లలో అభివృద్ధే లక్ష్యంగా దేశం ముందడుగు వేసిందన్నారు. 125 కోట్ల మంది భారతీయులు దేశాన్ని అత్యున్నత శిఖరాలపైకి చేర్చడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని మోదీ ట్వీట్‌ చేశారు.

Trending News