పెట్రోల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయ్...!

పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. కడపటి వార్తలు అందేసరికి, ఈ ధరలు గరిష్ఠానికి చేరాయి. 

Last Updated : Apr 21, 2018, 12:05 AM IST
పెట్రోల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయ్...!

పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. కడపటి వార్తలు అందేసరికి, ఈ ధరలు గరిష్ఠానికి చేరాయి. ఈ రోజు దేశ రాజధానిలో లీటరు డీజిల్‌ ధర రూ.65.31గా నమోదవ్వగా.. కోల్‌కతాలో రూ.68.01 నమోదైంది. చెన్నైలో అదే ధర రూ.68.9గా ఉండడం గమనార్హం. ప్రస్తుతానికి ఇవే ధరలు అమాంతం పెరిగి రూ.74.08గా ఢిల్లీలో నమోదవ్వడం ఆశ్చర్యకరం.

2013 సెప్టెంబర్‌ తర్వాత దీనిని అత్యధిక ధరగా పేర్కొనవచ్చు. ఈ మధ్యకాలంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ప్రతీ రోజు ధరలు మారే విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విధాన ప్రభావం మీద విదేశీ మార్కెట్ ప్రభావం కూడా ఉంది. ఈ మధ్యకాలంలో పెట్రోల్, డీజీల్ ‌ధరలను కూడా జీఎస్టీ పన్ను పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే వీటిపై రాష్ట్రాలు వేసే పన్నులు కూడా తగ్గించాలని చాలా రోజుగా ఒక డిమాండ్ ఉంది

Trending News