Petrol Price Today on 7 December 2020 Updates: తాజాగా వరుసగా ఆరోరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు రెండేండ్ల గరిష్టానికి చేరుకున్నాయి. అంతర్జాతీయడం ముడిచమురు ధరలు పెరగడంతో మరోసారి ఇంధన ధరలు పుంజుకున్నాయి. ఆయా రాష్ట్రాలలో వసూలు చేసే పన్నుల ఆధారంగా ఇంధన ధరలలో స్వల్ప వ్యత్యాసం కనిపిస్తుంది.
Diesel Costlier Than Petrol Price | ధర ఎప్పుడూ పెట్రోల్ ధర కంటే తక్కువగా ఉంటుందని మనందరికీ ఒక అంచనా ఉండేది. కానీ ఆ అంచనానే ఇప్పుడు తలకిందులైంది. ఎవ్వరూ ఊహించని రీతిలో డీజిల్ ధర పెట్రోల్ ధరను అధిగమించడం భారత మార్కెట్లో ఇదే మొదటిసారి.
ధరల తగ్గుదల అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ 74.43గా ఉండగా డీజిల్ రూ.67.61 గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలోనూ లీటర్ పెట్రోల్ ధర రూ.80.03 గా ఉండగా లీటర్ డీజిల్ ధర 70.88 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.79.14 కాగా లీటర్ డీజిల్ ధరలు 73.72గా ఉన్నాయి.
దేశీయ వినియోగదారులకు మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి సరకు ధరలు తగ్గడంతో వాటి ప్రభావం భారతదేశంలోని పెట్రోల్, డీజిల్ ధరల పై కూడా కనిపిస్తోంది.
బాబా రామ్‌దేవ్ ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "పెట్రోల్ ధరలు తగ్గించాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ప్రభుత్వం నాకు అవకాశమిస్తే నేను లీటర్ పెట్రోల్‌ను రూ.35 నుండి రూ.40లకు అమ్మగలను. అయితే.. ప్రభుత్వం కొంత ట్యాక్స్ తగ్గించాలి" అని ఆయన ఓ ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పెట్రోల్‌ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి.. అయితే దానిని 28 శాతం రేటు విభాగంలోకి తీసుకురాకూడదు" అని రామ్‌దేవ్ తెలిపారు.
రోజు రోజుకీ పెరుగుతున్న పెట్రోల్ ధరలు ఆందోళన కలిగిస్తున్నాయని.. ఈ క్రమంలో పెట్రోల్‌ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్న ఈ తరుణంలో గృహిణులకు చమురు కంపెనీలు శుభవార్తను అందించాయి. నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ల ధరను రూ 35.50 మేర ఆయిల్ కంపెనీలు తగ్గించాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గించడం ఇది రెండవసారి. వాణిజ్య సిలిండర్లకు మాత్రమే ప్రస్తుత తగ్గింపు వర్తించనుంది. తగ్గిన ధరలు ఆదివారం అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.
పెట్రోల్‌తో పాటు డీజిల్ ధరలు మరోసారి భారీస్థాయిలో పెరిగిపోయాయి. ఢిల్లీలో తాజా సమాచారం అందేసరికి లీటర్ పెట్రోల్ ధర రూ.74.73 రూపాయలు ఉండగా.. డీజిల్ ధర రూ.64.58 చిల్లరగా ఉంది.
వాహనదారులకు శుభవార్త. పెట్రో ధరలు మరింత తగ్గాయి. పెట్రోల్ పై రూ.2.50 వరకు.. డీజిల్ పై 2.41 మేర ధరలు తగ్గాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ముడిచమురుపై సుంఖం తగ్గించడంతో ఈ మేరకు పెట్రో ధరలు తగ్గించినట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. తాజా నిర్ణయంతో హైద్రాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 72.40, లీటర్ డీజిల్ ధర రూ.61.81గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 68.38, డీజిల్ ధర రూ. 56.89గా ఉంది. ఎన్టీయే సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్రో ఉత్పత్తులపై సుంఖం తగ్గించడం ఇదే తొలిసారి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.