Life Certificate: ఈ సర్టిఫికేట్‌ లేకుంటే పెన్షన్‌ ఆపేస్తారు.. లైఫ్‌ సర్టిఫికేట్‌ ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి..

Life Certificate Online Apply: ప్రతి ఏడాది పెన్షనర్లు అక్టోబర్‌ 1 నుంచి నవంబర్‌ 30వ తేదీలోపు ఈ లైఫ్‌ సర్టిఫికేట్‌ను సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే పింఛనుదారులకు నెలనెలా పెన్షన్ అందుతుంది. ఈ సర్టిఫికేట్‌ ద్వారా పెన్షనర్‌ బతికి ఉన్నాడని తెలియజేస్తుంది.

Written by - Renuka Godugu | Last Updated : Sep 25, 2024, 11:38 AM IST
Life Certificate: ఈ సర్టిఫికేట్‌ లేకుంటే పెన్షన్‌ ఆపేస్తారు.. లైఫ్‌ సర్టిఫికేట్‌ ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి..

Life Certificate Online Apply: ప్రతి నెలా పెన్షన్‌ పొందే పింఛనుదారులు ఏడాదికి ఒక్కసారి లైఫ్‌ సర్టిఫికేట్‌ను తప్పనిసరిగా అప్లై చేయాలి. తద్వారా సదరు పింఛనుదారుడు బతికి ఉన్నాడని తెలుస్తుంది. దీంతో వారికివ నెలానెలా చేతి సమయానికి పెన్షన్‌ అందుతుంది. అంటే సరైన వ్యక్తికి పెన్షన్‌ అందుతుందని ఇది ధృవీకరిస్తుంది.  అయితే, కెనరా బ్యాంక్‌ సీనియర్‌ సిటిజెన్లకు ఆన్‌లైన్‌ స్లాట్‌ బుక్‌ చేసుకునే వెసులుబాటును అందుబాటులోకి తీసుకువచ్చింది. అంటే లైఫ్ సర్టిఫికేట్‌ను నేరుగా వీడియో కాల్‌ ద్వారా అక్టోబర్‌ 1 నుంచి అప్లై చేయవచ్చు. అంటే పెన్షనర్లు ఇంట్లోనే కూర్చొని ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఇలా దరఖాస్తు చేస్తే సులభతరమైన ప్రక్రియ కూడా.

లైఫ్‌ సర్టిఫికేట్‌ అంటే ఏమిటి?
లైఫ్‌ సర్టిఫికేట్‌ అంటే జీవన్‌ ప్రమాణ్‌ అని కూడా పిలుస్తారు. ఇది పెన్షదారులకు ఎంతో ముఖ్యం. ఇది వారు ఇంకా బతికే ఉన్నారని ధృవీకరిస్తోంది.  ప్రతి ఏడాది పింఛనుదారుడు అప్లై చేయాలి. ఎక్కువ శాతం మంది నవంబర్‌లో అప్లై చేస్తారు కానీ, 80 ఏళ్లు పైబడిన వారు అక్టోబర్‌ నెలలోనే సబ్మిట్‌ చేసుకోవచ్చు.

లైఫ్‌ సర్టిఫికేట్‌ దరఖాస్తు చేసుకునే విధానం..
జీవన్‌ ప్రమాణ్‌ పోర్టల్‌ ద్వారా లైఫ్‌ సర్టిఫికేట్‌ దరఖాస్తు చేసుకోవాలి.
యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. జీవన్‌ ప్రమాణ్‌ యాప్‌ డౌట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ సదరు పింఛనుదారుడి వేలిముద్ర ద్వారా ధృవీకరిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇలా ఫేస్‌ ఆథంటికేషన్‌, బయోమెట్రిక్‌, వెరిఫికేషన్‌, ఐరీస్‌ స్కానింగ్‌ లేదా వీడియో కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: అక్టోబర్‌ 1 నుంచి 5 కొత్త రూల్స్‌.. ఏమిటీ ఆ భారీ మార్పులు ముందుగానే తెలుసుకోండి..

పెన్షనర్లకు లైఫ్‌ సర్టిఫికేట్‌కు సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే దగ్గరలో ఉన్న పోస్టాఫీస్‌కు వెళ్లి సందేహాలు నివృతి చేసుకోవచ్చు.

పెన్షనర్లు లైఫ్‌ సర్టిఫికేట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు చేయడానికి ఆధార్‌ ఫేస్‌ ఆర్‌డీ యాప్‌ కూడా గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి దరఖాస్తు చేయాలి. ఆ తర్వాత జీవన్‌ ప్రమాణ్‌ యాప్‌ కూడా డౌన్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. 

ఆ తర్వాత జవన్‌ ప్రమాణ్‌ యాప్‌ ఆపరేటర్‌ ఆథెంటికేషన స్క్రీన్‌ ఓపెన్‌ అవుతుంది. అక్కడ ఆధార్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌, ఇమెయిల్‌ అడ్రస్‌ను కూడా నమోదు చేయాలి.

పెన్షన్‌దారుని వివరాలు నమోదు చేసిన తర్వాత వన్‌ టైమ్‌ పాస్వర్డ్‌ (OTP) కూడా మొబైల్‌ నంబర్‌కు వస్తుంది

ఆ తర్వాత ఆధార్‌ నంబర్‌, పేరు స్క్రీన్‌ను తీసుకువెళ్తుంది. ఆ తర్వాత బాక్స్‌ చెక్‌ చేసి స్కాన్‌ ఆప్షన్‌ సెలక్ట్‌ చేయాలి. చివరగా ఎస్‌ ఫేస్‌ స్కాన్‌ పై క్లిక్‌ చేయాలి.

ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్యాంకులకు 28, 29 తేదీల్లో వరుసగా 2 రోజులు సెలవు..

అప్పుడు యాప్‌ మీకు ఫేస్‌ స్కాన్‌కు సంబంధంచిన సూచనలు చేస్తుంది.  కంటిన్యూ బట్టన్‌ నొక్కితే సదరు పెన్షన్‌ దారుడి పిక్చర్‌ తీసుకుంటుంది. ఆ తర్వాత పెన్షనర్‌ ఆథెంటికేషన్‌ స్క్రీన్‌ కనిపిస్తుంది.  మళ్లీ ఆధార్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌, ఆప్షనల్‌ మెయిల్‌ కూడా నమోదు చేయాలి.

యూజర్లు అదనపు సమాచారం ఇవ్వాలి అంటే పూర్తి పేరు, పెన్షన్‌ టైపు, ఆథారిటీ, ఏజెన్సీ, పీపీఓ నంబర్‌, ఖాతా నంబర్‌ మీ వివరాలను నమోదు చేయాలి.
చివరగా ప్రమాణ్‌ ఐడీ, పీపీఓ నంబర్‌ కూడా మొబైల్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News