లేదంటే హైదరాబాద్ మరో పాలస్తినా అయ్యుండేది: కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్

లేదంటే హైదరాబాద్ మరో పాలస్తినా అయ్యుండేది : రవి శంకర్ ప్రసాద్

Last Updated : Sep 14, 2019, 12:26 PM IST
లేదంటే హైదరాబాద్ మరో పాలస్తినా అయ్యుండేది: కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్

న్యూ ఢిల్లీ: పవిత్ర గ్రంథమైన భగవద్ గీత నుంచే భారత రాజ్యాంగాన్ని స్పూర్తిగా తీసుకున్నారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర సర్కార్ భారత రాజ్యాంగానికి మరింత విలువలను జోడించారని చెప్పే క్రమంలో రవిశంకర్ ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రిటీష్ కాలం నాటి చట్టాలను పక్కన పెడుతూ మహిళ భద్రత కోసం మోదీ కొత్త చట్టాలను తీసుకొచ్చారని అన్నారు. త్రిపుల్ తలాక్, బినామి ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ యాక్ట్ తదితర చట్టాల రూపకల్పనతో మోదీ సర్కార్ ప్రజలవైపు నిలబడిందన్నారు. ఇంతకాలం ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన దాదాపు 1400 చట్టాలను పక్కనపెట్టేసి మోదీ సర్కార్.. రాష్ట్రాల పరిధిలో ఉన్న మరో 225 పాత చట్టాలను కూడా పాతరేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిందని మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

న్యాయ శాఖ గురించి మాట్లాడుతూ.. మోదీ అధికారంలోకొచ్చాకా అప్పటివరకు దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో ఏళ్లతరబడిగా పెండింగ్‌లో ఉన్న కొన్ని మిలియన్ల కేసులను పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇక అక్టోబర్ 2 నుంచి ప్రభుత్వ విధానాలను లోబడి నడుచుకోకుండా ఆదాయ పన్ను శాఖ అధికారులు సామాన్యులకు నోటీసులు పంపడానికి వీల్లేదని మంత్రి రవిశంకర్ ప్రసాద్ మరోసారి పునరుద్ఘాటించారు. 

జమ్మూకాశ్మీర్‌లో మోదీ సర్కార్ ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ.. భారత తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ కశ్మీర్ అంశాన్ని సమర్థవంతంగా ఎదుర్కోలేక అంతర్జాతీయ దేశాలను జోక్యం చేసుకోవాల్సిందిగా కోరి తప్పు చేశారని అన్నారు. అయితే, అన్ని రాష్ట్రాలను భారత్‌లో కలుపుతూ తొలి హోంశాఖ మంత్రి సర్ధార్ వల్లభభాయ్ పటేల్ తీసుకున్న నిర్ణయం గొప్పదని, ఆయనే కనుక హైదరాబాద్‌ని దేశంలో కలపకపోయి వుంటే.. ఇవాళ హైదరాబాద్ కాస్తా మరో పాలస్తీనాగా మారి ఉండేదని మంత్రి రవిశంకర్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు.

Trending News