Godavari Floods: తెలుగు రాష్ట్రాలను వదలని వాన.. గోదావరి ఉగ్రరూపంతో హై అలర్ట్

Godavari Floods: తెలుగు రాష్ట్రాలను వరణుడు వదలడం లేదు. గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి మరోసారి మహోగ్రరూపం దాల్చింది

Written by - Srisailam | Last Updated : Sep 14, 2022, 10:34 AM IST
  • తెలుగు రాష్ట్రాలను వదలని వాన
  • మరో ఐదు రోజుల వర్ష సూచన
  • గోదావరి మళ్లీ ఉగ్రరూపం
 Godavari Floods: తెలుగు రాష్ట్రాలను వదలని వాన.. గోదావరి ఉగ్రరూపంతో హై అలర్ట్

Godavari Floods:  తెలుగు రాష్ట్రాలను వరణుడు వదలడం లేదు. గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి మరోసారి మహోగ్రరూపం దాల్చింది. కృష్ణా పరవళ్లు తొక్కుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాలకు  వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వెస్ట్ భారత్ నుంచి  తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయని తెలిపింది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి మరోసారి మహోగ్రరూపం దాల్చింది.భద్రచాలం దగ్గర గోదావరి నీటిమట్టం ప్రమాదకరస్థాయికి చేరింది. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం బుధవారం ఉదయం 9 గంటలకు 51.40 అడుగులకు చేరింది. ధవళేశ్వరం నుంచి 12.74 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి చేరుతోంది. వరద ఉధృతి గంటగంటకు పెరుగుతుండటంతో సాయంత్రానికి అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గౌతమి, వశిష్ట, వైనతేయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కనకాయలంక, టేకిశేట్టిపాలెం, ఎదురుబిడియం, అప్పనపల్లి కాజేవేలు నీట ముగిగాయి. ఏజెన్సీ ప్రాంతంలో కొండ వాగులు, శబరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో గోదావరికి వరద గంటగంటకు పెరుగుతోంది. గోదావరి వరద పెరగడంతో ముంపు మండలాలు  కూనవరం, వీఆర్‌ పురం, ఎటపాక  జల దిగ్బంధంలోనే ఉన్నాయి. గోదావరి తీర ప్రాంత ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.  స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి నిరంతరం సమీక్షిస్తున్నారు.

అటు కృష్ణానదికి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం పెరుగుతోంది.  శ్రీశైలం డ్యాం 9 గేట్లు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. శ్రీశైలానికి ఇన్‌ఫ్లో 3.23 లక్షలుగా ఉండగా.. ఔట్‌ ఫ్లో 3.13 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నాగార్జున సాగర్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది.

Read Also: AP CAPITAL: మూడు రాజధానులపై జగన్ కు షాక్.. టీడీపీ పొత్తుకు బీజేపీ గ్రీన్ సిగ్నల్?

Read Also: Telangana Elections: అసెంబ్లీ రద్దు ఎప్పుడు? కేసీఆర్ ప్లాన్ మారిందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News