World Smallest Emergency Hospital: ప్రపంచంలోనే అతి చిన్న ఆసుపత్రిని నిర్మించి భారత్ రికార్డు సృష్టించింది. రూబిక్స్ క్యూబ్ ఆకారంలో రక్షణ, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు, హెచ్‌ఎల్ఎల్ లైఫ్‌కేర్‌తో కలిసి రూబిక్స్ క్యూబ్ ఆకారంలో ఒక చిన్న ఆసుపత్రిని అభివృద్ధి చేశాయి. ఈ ఆసుపత్రిని మయన్మార్‌కు విరాళంగా అందజేసింది. శ్రీలంకకు కూడా ఇలాంటి మరో ఆసుపత్రిని విరాళంగా ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ హాస్పిటల్‌ను ప్రాజెక్ట్ భీష్మ కింద తయారు చేసింది. ఈ చిన్న ఆసుపత్రికి ఆరోగ్య మైత్రి క్యూబ్ అని పేరు పెట్టారు. ఇది ప్రపంచంలోనే అతిచిన్న అత్యవసర ఆసుపత్రి కావడం విశేషం.
ఇది రూబిక్స్ క్యూబ్ ఆకారంలో చతురస్రాకార పెట్టెల్లో నిర్మించారు. ఇందులో అన్ని రకాల వసతులు ఉంటాయి. ఈ చిన్న ఆసుపత్రిని 72 చదరపు పెట్టెల్లో తయారు చేశారు. ఆసుపత్రి చాలా చిన్నది. ఎక్కడికైనా తీసుకెళ్లేవిధంగా డిజైన్ చేశారు. ఎయిర్‌లిఫ్ట్ కూడా చేయవచ్చు. ఇది చాలా బలంగా ఉంటంది. ఆకాశం నుంచి నేలపైకి విసిరినా విరిగిపోదు. నీటిలో పడినా పాడైపోదు.
ఈ ఆసుపత్రి మూడు ఇనుప ఫ్రేమ్‌లు, 36 పెట్టెలతో 720 కిలోల బరువు ఉంటుంది. ప్రతి పెట్టెపై క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. ఏ పెట్టెలో మందులు, వాటి గడువు తేదీ వంటి వివరాలను తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే సరిపోతుంది. అంతేకాకుండా ఫ్రాక్చర్ ట్రీట్‌మెంట్ కోసం ఏ పెట్టెలో మెటీరియల్ ఉందో, ఎక్స్-రే సౌకర్యం ఉన్నదీ కూడా తెలిసిపోతుంది. ఈ అత్యవసర ఆసుపత్రిని ఉపయోగించి.. 8 నుంచి 10 నిమిషాల్లో ఆపరేషన్ థియేటర్‌ను సిద్ధం చేయవచ్చు. ఓ గంటలో మొత్తం ఆసుపత్రిని రెడీ చేయవచ్చు. ఆసుపత్రిలోని మూడు ఫ్రేమ్‌లు, పైకప్పుపై ఉన్న ఆపరేషన్ థియేటర్ మధ్య జనరేటర్లను అమర్చారు.
ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, పడకలు, మందులు, ఆహార పదార్థాలు కూడా అందుబాటులో ఇందులో ఉన్నాయి. 200 మందికి చికిత్స చేయవచ్చు. 100 మంది రోగులను 48 గంటల పాటు పడకలపై ఉంచవచ్చు. సోలార్ ఎనర్జీ, బ్యాటరీల సహాయంతో ఈ ఆసుపత్రిని పూర్తిగా నడపవచ్చు. టెస్టింగ్ ల్యాబ్, వెంటిలేటర్, ఎక్స్-రే, అల్ట్రాసౌండ్ మెషిన్ వంటి పరికరాలతో కూడిన ఈ ఆసుపత్రిలో ఆధునిక ఆసుపత్రిలో ఉండాల్సినవన్నీ ఉన్నాయి. అన్నీ సౌకర్యాలతో అద్భుతంగా అభివృద్ధి చేశారు. యుద్ధ సమయంలో ఇలాంటి బాగా ఉపయోపడతాయి. అదేవిధంగా వైద్య సౌకర్యాలు లేని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ఆరోగ్య మైత్రి క్యూబ్ ఆసుపత్రులతో ప్రయోజనం చేకూరనుంది.
Also Read: India World Cup 2023 Squad: సస్పెన్స్ వీడింది.. ప్రపంచ కప్‌కు భారత జట్టు ప్రకటన
Also Read: RBI UPI Payments: యూపీఐ యూజర్లకు ఆర్‌బీఐ మరో గుడ్‌న్యూస్.. ఇది కదా అసలు కిక్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook