India Corona Update: కరోనా మహమ్మారి సంక్రమణ నెమ్మది నెమ్మదిగా పెరుగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో సైతం ఇదే పరిస్థితి.
దేశంలో కరోనా వైరస్(Corona virus)ఉధృతి మళ్లీ పెరుగుతోంది. చాలారోజుల్నించి తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల్లో మళ్లీ పెరుగుదల కన్పిస్తోంది. మొన్నటి వరకూ 35-38 వేల మధ్యలో నమోదైన కరోనా కేసులు..ఇప్పుడు 41 వేలు దాటి నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 41 వేల 831 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 541 మంది కోవిడ్ కారణంగా మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 4 లక్షల 24 వేల 351 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 39 వేల 258 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకూ 3 కోట్ల 8 లక్షల 20 వేల 521 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4 లక్షల 10 వేల 952 కరోనా పాజిటివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 47 కోట్ల 2 లక్షల 98 వేల 596 మందికి కరోనా వ్యాక్సిన్(Corona vaccine)ఇచ్చారు. దేశంలో కేరళ, మహారాష్ట్రలలో గత కొద్దిరోజులుగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా థర్డ్‌వేవ్ (Corona Third Wave) ప్రారంభమైందనే సంకేతాలు విన్పిస్తున్నాయి.
Also read: పంద్రాగస్టున ప్రజల ఆలోచన, మాటలు ప్రధాని మోదీ నోట..ఎలాగంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook