ఇండియన్ 'ఒసామా బిన్ లాడెన్' అరెస్టు..!

అబ్దుల్ సుభాన్ ఖురేషీ అలియాస్ తౌకీర్ 2008 గుజరాత్ సీరియల్ బ్లాస్ట్స్‌ కేసులో ప్రధాన నిందితుడు

Last Updated : Jan 22, 2018, 04:01 PM IST
ఇండియన్ 'ఒసామా బిన్ లాడెన్' అరెస్టు..!

అబ్దుల్ సుభాన్ ఖురేషీ అలియాస్ తౌకీర్ 2008 గుజరాత్ సీరియల్ బ్లాస్ట్స్‌ కేసులో ప్రధాన నిందితుడు. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా (సిమి)తో పాటు ఇండియన్ ముజాహిదిన్ సభ్యుడైన ఖురేషీని ఇండియన్ ఒసామా బిన్ లాడెన్ అని కూడా అంటుంటారు.

ప్రపంచంలోనే బాంబుల తయారీ రంగంలో గొప్ప నిపుణుడైన ఖురేషీని ఈ రోజు ఢిల్లీలో సెక్యూరిటీ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. "ఇండియన్ ముజాహిదిన్‌లో కీలకసభ్యుడైన ఖురేషీని మేము ఈ రోజు అరెస్టు చేశాం. ఆయన నుండి పలు ఆధారాలు సేకరిస్తున్నాం. ఖురేషీ ఫోర్జరీ డాక్యుమెంట్లతో గత కొంతకాలంగా నేపాల్‌లో నివసిస్తున్నాడు. ఒక పెద్ద పథకంలో భాగంగానే ఆయన మళ్లీ భారత్‌కు తిరగొచ్చారు " అని స్పెషల్ సెల్‌కు చెందిన డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ ప్రమోద్ కుష్వానా మీడియాకి తెలిపారు. 

Trending News