India: కరోనా విజృంభణ.. మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు

భారత్‌లో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యం రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం రికార్డుస్థాయిలో 95,735 కేసులు నమోదు కాగా.. గురువారం వెలుగులోకి వచ్చిన కేసులు, మరణాలు మళ్లీ ఆ రికార్డును బ్రేక్ చేశాయి.

Last Updated : Sep 11, 2020, 09:55 AM IST
India: కరోనా విజృంభణ.. మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు

Covid-19 updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యం రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం రికార్డుస్థాయిలో 95,735 కేసులు నమోదు కాగా.. గురువారం వెలుగులోకి వచ్చిన కేసులు, మరణాలు మళ్లీ ఆ రికార్డును బ్రేక్ చేశాయి. గత 24గంటల్లో గురువారం ( సెప్టెంబరు 10న ) దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో.. 96,551 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 1,209 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 45,62,415కి పెరగగా.. మరణాల సంఖ్య 76,271కి పెరిగింది. Also read: Paresh Rawal: విలక్షణ నటుడికి కీలక పదవి

ప్రస్తుతం దేశంలో 9,43,480 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 35,42,664 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. గురువారం దేశవ్యాప్తంగా 11,63,542 కరోనా టెస్టులు చేశారు. దీంతో సెప్టెంబరు 10 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 5,40,97,975 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. Also read: AstraZeneca Vaccine: ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్

Trending News