JEE Advanced Result 2022: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల... టాపర్స్ లిస్ట్ ఇదే...

JEE Advanced Result 2022: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీ బాంబే ఫలితాలను ప్రకటించింది.రిజల్ట్స్‌తో పాటు ఫైనల్ ఆన్సర్ 'కీ' కూడా ఇవాళ విడుదల చేశారు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Sep 11, 2022, 12:02 PM IST
  • జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు నేడే
  • విడుదల చేయనున్న ఐఐటీ బాంబే
  • విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
JEE Advanced Result 2022: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల... టాపర్స్ లిస్ట్ ఇదే...

JEE Advanced Result 2022 Released: ఐఐటీ బాంబే ఇవాళ ఉదయం 10 గంటలకు జేఈఈ అడ్వాన్స్డ్ 2022 ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలను jeeadv.ac.in. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఫలితాలు ప్రకటించిన వెంటనే జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ లింక్ యాక్టివేట్ అయింది. రిజల్ట్స్‌తో పాటు ఫైనల్ ఆన్సర్ 'కీ' కూడా ఇవాళ విడుదల చేశారు.

విద్యార్థులు ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి 

మొదట జేఈఈ అడ్వాన్స్డ్ అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in ఓపెన్ చేయండి
హోంపేజీలో JEE Advanced Results 2022 అనే ఆప్షన్ కనిపిస్తుంది
దానిపై క్లిక్ చేసి రూల్ నంబర్, పుట్టిన తేదీ తదితర వివరాలు నమోదు చేయండి
చివరగా సబ్‌మిట్ ఆప్షన్ నొక్కండి. అంతే.. ఫలితాలు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి
ఫలితాల కాపీని ప్రింటవుట్ తీసి ఉంచుకోండి

జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్స్ లిస్ట్ ఇదే :

ఐఐటీ బాంబే జోన్‌కి చెందిన ఆర్‌కే శిశిర్ జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్‌గా నిలిచాడు. పోలు లక్ష్మి సాయి లోహిత్ రెడ్డి, థామస్ బిజు చీరమ్‌వెలిల్, వంగపల్లి సాయి సిద్దార్థ,మయాంక్ మోత్వానీ, పోలిశెట్టి కార్తీకేయ, ప్రతీక్ సాహు, ధీరజ్ కురుకుంద, మహిత్ గదివాలా, వెచ్చ జ్ఞాన మహేష్ టాప్-9 ర్యాంకర్స్‌గా నిలిచారు. 

రేపటి నుంచే కౌన్సెలింగ్ :
 

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 8న ఐఐటీ బాంబే ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరిగింది. దాదాపు 1,56,089 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ప్రాథమిక ఆన్సర్ కీ సెప్టెంబర్ 3న విడుదల చేశారు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలైన మరుసటిరోజు (సెప్టెంబర్ 12) నుంచే జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (JOSAA) కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది. 

ఐఐటీల్లో ఈసారి కూడా కంప్యూటర్ సైన్స్, ఐటీ కోర్సులకే డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. విద్యార్థులు ఎక్కువగా ఈ కోర్సుల వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్స్ తదితర కోర్సుల్లో మూడింట ఒకవంతు సీట్లు నిండటం కూడా కష్టమవుతోందని ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్ వి రాంగోపాల్ రావు పేర్కొనడం గమనార్హం. 

Also Read: Krishnam Raju Died: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత

Also Read: Krishnam Raju Death: దిగ్గజ నటుడు కృష్ణంరాజు మరణంపై హీరోలు మంచు మనోజ్, నిఖిల్ రియాక్షన్..   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News