Mini Lockdown: కరోనా మహమ్మారి దేశంలో సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు. దేశమంతా పంజా విసురుతున్న కరోనా వైరస్ ధాటికి జనం గజగజలాడుతున్నారు. కర్నాటకలో సైతం పరిస్థితి శృతి మించుతుండటంతో మినీ లాక్డౌన్ అమలు చేస్తున్నారు.
దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీలతో పాటు కర్నాటకలో కరోనా వైరస్ (Corona virus)కేసులు భారీగా నమోదవుతున్నాయి. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు వెలుగుచూస్తున్నాయి. గత 24 గంటల్లో కర్నాటక ( Karnataka) చరిత్రలోనే అత్యధికంగా 34 వేల 804 కొత్త కేసులు బయటపడ్డాయి. మరోవైపు 6 వేల 982 మంది కోలుకున్నారు. 143 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 13 లక్షల 39 వేల 201 మందికి కరోనా సోకింది. అందులో 10 లక్షల 62 వేల 594 మంది కోలుకోగా..14 వేల 426 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2 లక్షల 62 వేల యాక్టివ్ కేసులున్నాయి.
నలువైపుల్నించీ కరోనా ముట్టడించడంతో బెంగళూరు నగరం నలిగిపోతోంది. నగరంలో కోవిడ్ సంక్రమణ రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా 20 వేల మంది కరోనా బారిన పడ్డారు. నగరంలో ప్రస్తుతం 1 లక్షా 80 వేల 542 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1 లక్షా 76 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 86 లక్షల మంది కరోనా వ్యాక్సిన్(Corona Vaccination) తీసుకున్నారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో రాష్ట్రంలో నైట్‌కర్ఫ్యూ( Night Curfew )తో పాటు వీకెండ్ కర్ఫ్యూ (Weekend Curfew) అమలు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ పూర్తిగా లాక్డౌన్ ( Lockdown) అమల్లో ఉంటోంది. ఫలితంగా వ్యాపార సముదాయాలు, మార్కెట్లు మూతపడ్డాయి. నిబంధనలు ఉల్లంఘించి బయట తిరిగేవారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
మరోవైపు ఇవాళ్టి నుంచి కర్నాటకలో మినీ లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఇకపై వ్యాపార లావాదేవీలకు అనుమతి ఉండదు. నిత్యావసరం కాని షాపులు, మాల్స్, ధియేటర్లు మూతపడి ఉంటాయి. ఫలితంగా కార్మికులు సొంత ఊళ్లకు వెళ్లిపోతున్నారు. మే 4 వ తేదీ వరకూ రాష్ట్రంలో మినీ లాక్డౌన్( Mini Lockdown) అమల్లో ఉంటుంది.
Also read: Oxygen Supply: దేశంలోని వివిధ స్టీల్ప్లాంట్ల నుంచి ఎంత ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook